Nepal Flash Floods : నేపాల్ విపత్తు.. 700దాటిన మృతుల సంఖ్య.. జిల్లాల వారీగా జాబితాను విడుదల చేసిన సర్కార్

Nepal Flash Floods Updates : నేపాల్ - టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ వరదల కారణంగా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

Nepal Flash Floods Updates

Nepal Flash Floods Updates : నేపాల్ – టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ వరదల కారణంగా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నేపాల్ ప్రభుత్వం తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతుల సంఖ్య 700 దాటింది. 2,426 మంది గల్లంతయ్యారు. అయితే, జిల్లాల వారీగా మృతుల జాబితాను ప్రభుత్వం రిలీజ్ చేసింది.

Also Read : Suryapet District : సూర్యాపేట జిల్లాలో దారుణం.. ఇద్దరు ప్రాణాలు బలిగొన్న వేపచెట్టు.. ఎస్ఐకుసైతం తీవ్రగాయాలు

నేపాల్ లో వరద బీభత్సం కారణంగా పలు జిల్లాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. రుసువాలో 13 మంది, ధాదింగ్ జిల్లాలో 45మంది, గోర్కాలో 48మంది, నవల్పూర్ (తూర్పు)లో 158మంది, నవల్పూర్ (పశ్చిమ)లో 40మంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా నువాకోట్ 49, చిత్వన్ 233, తనహు జిల్లాలో 31 మంది మృత్యువాత పడ్డారు. రుసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో గాయపడినట్లు, వారిలో చాలా మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు.


నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ విపత్తు తరువాత 5,851 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 8, 791 మంది పోలీసు సిబ్బంది సేవలందిస్తున్నారు. త్రిశూలి నది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో తాత్కాలికంగా సహాయక చర్యలను అధికారులు నిలిపివేశారు. మరోవైపు.. త్రిశూలి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో ముందస్తు జాగ్రత్తగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


నీరు రంగుమారుతోంది.. హెచ్చరించిన చైనా..
హిమానీనదం బద్దలై నేపాల్ లో వరదలు రాగా.. వరదల సమయంలో రాళ్లు, బురద, మంచు, ఇతర శిథిలాలతో టిబెట్ వైపున ఏర్పడిన సరస్సు పొంగుతోందని, ప్రస్తుతం ఆ సరస్సులోని నీరు రంగు మారుతోందని.. వరద ముప్పు పొంచిఉంది అప్రమత్తంగా ఉండాలంటూ చైనా అధికారులు హెచ్చరించారు. చైనా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వరదల తరువాత ఏర్పడిన సరస్సు రంగు ప్రస్తుతం మారుతోంది. ముదురు రంగులోకి వస్తోంది. సరస్సు బద్దలై దిగువకు వదర పోటెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.