×
Ad

Nepal Protests Video: ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, వాట్సాప్‌పై బ్యాన్‌తో వేలాది మంది నిరసన.. కర్ఫ్యూ.. 9 మంది మృతి.. 42 మందికి గాయాలు

పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు టియర్‌ గ్యాస్‌, వాటర్‌ కానన్‌లను వాడారు.

Nepal

Nepal: నేపాల్‌లో సోషల్‌ మీడియాపై నిషేధం విధించడంతో వేలాది మంది యువత రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనల్లో తొమ్మిది మంది మృతిచెందారు. మరో 42 మందికి తీవ్రగాయాలయ్యాయి.

పార్లమెంట్‌ వద్ద కర్ఫ్యూ ప్రకటించారు. కాఠ్మాండూలో భారీ నిరసనలతో సైన్యం పెద్ద ఎత్తున మోహరించింది.

Nepal

సోషల్‌ మీడియాపై నిషేధంతో పాటు అవినీతికి వ్యతిరేకంగానూ యువత నినాదాలు చేస్తోంది. ఫెడరల్‌ పార్లమెంట్‌ ప్రాంగణంలోకి నిరసనకారులు చొచ్చుకెళ్లారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. పోలీసులు టియర్‌ గ్యాస్‌, వాటర్‌ కానన్‌ వాడారు.

సెప్టెంబర్‌ 4న నేపాల్ ప్రభుత్వం 26 సోషల్‌ మీడియా యాప్‌లపై నిషేధం విధించింది. బ్యాన్‌ను ఎత్తివేయాలన్న డిమాండ్‌తో పాటు నేపాల్‌లో అవినీతి, నిరుద్యోగం పెరిగిపోతోందంటూ యువత కాఠ్మాండు సహా ఇతర నగరాల్లోనూ వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.

Also Read: చంద్రగ్రహణం అయిపోయింది.. ఈ నెలలోనే సూర్యగ్రహణం.. డేట్, టైమ్.. ఫుల్ డిటెయిల్స్..

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, వాట్సాప్‌, రెడిట్‌, ఎక్స్‌ వంటి వేదికలను నిషేధించింది. ఆయా కంపెనీలు నేపాల్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అంటోంది. (Nepal)

అలాగే, ఆ కంపెనీల పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని, ఫిర్యాదులకు ప్రతినిధులను నియమించాలని, దుర్వినియోగాన్ని అరికట్టే వ్యవస్థలను అమలు చేయాలని, అప్పటివరకు వరకు ఈ నిషేధం కొనసాగుతుందని అధికారులు అంటున్నారు.

ప్రభుత్వం తెలిపిన ప్రకారం టిక్‌టాక్‌, వైబర్‌ వంటి కంపెనీలు ఈ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడంతో నిషేధం నుంచి తప్పించుకున్నాయి.