ఉద్యోగికి కరోనా: నెట్‌ఫ్లిక్స్ ఆఫీస్ మూసివేత

  • Publish Date - March 13, 2020 / 02:20 AM IST

ప్రముఖ ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తన లాస్ ఏంజెల్స్ కార్యాలయాలలో ఒకదానిని మూసివేసింది. లాస్ ఏంజిల్స్ ఉద్యోగులందరూ ఇంటి దగ్గర నుంచి పని(వర్క్ ఫ్రమ్ హోమ్) చెయ్యాలని కంపెనీ సూచనలు చేసింది. కరోనావైరస్ రోగి ఒకరు ఆ కంపెనీలో ఆ కార్యాలయంలో పనిచేసినట్లు తేలడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకంది. ఆ కార్యాలయం భవనాన్ని శుభ్రపరుస్తున్నారు.(కరోనా ఎఫెక్ట్ : విదేశాల నుంచి వచ్చిన వారు ఇంటివద్దే ఉండండి)

ఇప్పటికే హాలీవుడ్‌లో ప్రముఖ ఏజెన్సీలు అనేకం మూసివేయబడ్డాయి. అలాగే నెట్‌వర్క్‌లు, స్టూడియోలు.. తమ కార్యాలయాలను మూసివేస్తూ కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇంటి దగ్గర నుంచే పనిచేయమని ఉద్యోగులను కోరుతున్నాయి. హాలీవుడ్ లో ఇప్పటికే కొన్ని షూటింగ్ లు కూడా కరోనా వైరస్ భయంతో ఆగిపోయాయి. 

అలాగే బ్రాడ్‌వే థియేటర్లు, థీమ్ పార్కులు, క్రీడా కార్యక్రమాలు, కచేరీలు వంటి బహిరంగ ప్రదేశాలు జనాలు ఎక్కువగా సమూహంగా అయ్యే చోట్లు మూసివేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారికి ఇప్పటికే వేల మంది ప్రాణాలు తీసుకోగా.. లక్షల మంది బాధితులుగా మారారు.(ప్రధాని భార్యకు కరోనా వచ్చిందని Work from Home)