జన్యుపరమైన సమస్యలుంటేనే శిశువులకు జబ్బులు వస్తాయనేది తెలిసిందే. మరి వైరస్ కూడా అలానే వస్తుందా అంటే నిపుణుల సమాధానం అవుననే వస్తుంది. అమెరికాలో రీసెర్చ్ గ్రూపులు దీనిపై పలు రకాల సమధానాలిస్తున్నారు. కొవిడ్ 19 ఇన్ఫెక్షన్లు అనుమానితులు, పాజిటివ్ కేసులపై పరిశోధనలు జరిపారు. ప్రసవం సమయంలో గర్భిణీ తల్లి నుంచి శిశువుకు కరోనా వస్తుందా లేదా అనేది ప్రయోగం ముఖ్య ఉద్దేశ్యం.
ఇటీవల చైనాలో ఓ గర్భిణీ డెలీవరి కోసం హాస్పిటల్ లో జాయిన్ అయింది. అయితే ఆమె కాస్త అనారోగ్యంగా ఉండటంతో వైద్యులు పరీక్షలు చేసి కరోనా ఉందని తేల్చారు. ముందుజాగ్రత్తగా యాంటీ వైరల్ డోస్ లు ఇచ్చినప్పటికీ వైరస్ గర్భసంచికి పాకింది.
డెలివరీ తర్వాత శిశువు హెల్త్ చెక్ చేయడంతో కరోనా పాజిటివ్ అని తేలింది. బరువు, హార్ట్ బీట్ అన్నీ సరిగ్గానే ఉన్నా కరోనా వైరస్ శిశువుకు సోకిందని పేరెంట్స్ వాపోతున్నారు. ‘పుట్టిన వెంటనే రక్తనమూనాలను సేకరించి బ్లడ్ టెస్టులు చేశాం. పాపకు కరోనా పాజిటివ్ వచ్చింది’ అని వైద్యులు అంటున్నారు. ఇంత ఆలస్యం కాకుండా ఇంకొద్ది రోజుల ముందే హాస్పిటల్ కు తీసుకొచ్చినట్లు అయితే వైరస్ శిశువుకు రాకుండా అడ్డుకునే వాళ్లమని డాక్టర్లు అంటున్నారు.
చైనాలో ఇదే తరహాగా 33మంది చిన్నారులకు కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. ప్రసవం తర్వాత రెండ్రోజుల వరకూ టెస్టులు చేయకపోవడంతో యాంటీ డోసుల వల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదు. కొందరు రీసెర్చర్లు తల్లికి ఉన్న కరోనా పాపకు కచ్చితంగా వచ్చి తీరుతుందని దానిని తప్పించలేమని అంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత సమయంలో గర్భిణీలు ప్రసవానికి సిద్ధమవుతుంటే కరోనా టెస్టు కూడా తప్పనిసరిగా చేయించుకోవాల్సిందే.
Also Read | మీ ఇళ్లే మీ Big Boss ..బయటకు వెళ్లకపోవడమే మీ టాస్క్..కరోనాను ప్రారదోలుదాం