Military Aircraft Crash : ఘోర ప్రమాదం.. కుప్పకూలిన సైనిక విమానం.. 32మంది మృతి

Military Aircraft Crash : నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 32 మందితో వెళ్తున్న సైనిక విమానం కుప్పకూలిపోయింది.

Nigerian Military Aircraft Crash

Military Aircraft Crash : నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 32 మందితో వెళ్తున్న సైనిక విమానం సోమవారం దక్షిణ నైజీరియాలోని ఒండో రాష్ట్రంలో కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు భారీగా గాలింపు, సహాయక చర్యలు చేపట్టారు.

Also Read : Raghunandan Rao: హైకోర్టు సీజేకు ఎంపీ రఘునందన్ సంచలన లేఖ.. రేవంత్, కేటీఆర్ ఆస్తులపై విచారణకు డిమాండ్!

నైజీరియా వైమానిక దళానికి చెందిన ATR-42 విమానం సాధారణ కార్యకలాపాల్లో భాగంగా బెనిన్ నుంచి దేశ ఆర్థిక రాజధాని లాగోస్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇగ్బోకోడా ప్రాంతంలోని నేవల్ బేస్ సమీపంలో విమానం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు.

విమానంలో 25 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది కలిపి మొత్తం 32 మంది ఉన్నట్లు నైజీరియా విమానయాన మంత్రి ఫెస్టస్ కేయామో వెల్లడించారు. వీరంతా మృతి చెందారని తెలిపారు. విమానంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు సంబంధాలు తెగిపోయిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద స్థలాన్ని గుర్తించిన అధికారులు వెంటనే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. విమానం నదికి సమీపంలో కూలినట్లు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు, విమానానికి, జరిగిన నష్టం తదితర వివరాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మంత్రి ఫెస్టస్ కేయామో వెల్లడించిన వివరాల ప్రకారం.. NGR 931 టెయిల్ నంబర్‌ కలిగిన సైనిక విమానం బెనిన్ నుంచి లాగోస్‌కు వెళ్తుండగా ఉదయం 9:13 గంటలకు విమానంతో సంబంధాలు తెగిపోయాయని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు నాకు సమాచారం అందించారు. విమానాన్ని రేడియో ద్వారా సంప్రదించేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. అనంతరం అందిన సమాచారం ప్రకారం.. ఒండో రాష్ట్రంలోని ఇగ్బోకోడా ప్రాంతంలోని నేవల్ బేస్ సమీపంలో విమానం శకలాలను రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. ప్రస్తుతం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ఘటనపై నైజీరియా వైమానిక దళాధిపతి ఎయిర్ మార్షల్ సండే కెల్విన్ అనెకేతో మాట్లాడాను. ప్రస్తుతం కొనసాగుతున్న గాలింపు, సహాయక చర్యలకు మా శాఖ తరఫున పూర్తి సహకారం, సహాయం అందిస్తామని హామీ ఇచ్చానని తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విమానంలో 25 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది.. మొత్తం 32 మంది ఉన్నారు. వారంతా మృతి చెందారని తెలుస్తుందని చెప్పారు.