Kallasa Nithyananda: మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిత్యానంద.. చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ ఫొటోతో ఆసక్తికర ట్వీట్ ..

నిత్యానంద మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారాడు. చైనా అధ్యక్షుడిగా మూడవ సారి జీ జిన్‌పింగ్ ఎంపికైన విషయం విధితమే. జిన్‌పింగ్‌ను అభినందిస్తూ నిత్యానంద తన అధికారిక ట్విటర్ ఖాతా నుంచి ఆసక్తికర ట్వీట్ చేశారు.

Kallasa Nithyananda: భారత్‌లో కిడ్నాప్, అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద 2019లో దేశం విడిచి పారిపోయిన విషయం విధితమే. కొన్ని సంవత్సరాల తరువాత దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌లో కొంత భూమిని కొనుగోలు చేసి ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ గా ఒకదేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించుకున్నాడు. అయితే, అధికారిక ధృవీకరణ ఇంకా జరగలేదు. ఇటీవల ఐక్యరాజ్య సమితి ప్రతినిధుల సమావేశంలో కైలాస దేశ ప్రతినిధులమంటూ కొందరు ప్రత్యక్షం కావటం చర్చనీయాంశంగా మారింది. వీరు భారత్ పై ఆరోపణలుసైతం చేశారు. అయితే, యూఎన్ ప్రతినిధులు వారి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోమని చెప్పారు.

Nithyananda Kailasa: నిత్యానందకు షాకిచ్చిన యూఎన్.. వారి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోమని వెల్లడి

తాజాగా నిత్యానంద మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారాడు. చైనా అధ్యక్షుడిగా మూడవ సారి జీ జిన్‌పింగ్ ఎంపికైన విషయం విధితమే. జిన్‌పింగ్‌ను అభినందిస్తూ నిత్యానంద తన అధికారిక ట్విటర్ ఖాతా నుంచి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ దేశ అధ్యక్షుడిగా విజయవంతమైన పదవీకాలాన్ని పూర్తిచేసినందుకు మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. మీ గొప్ప దేశం, దేశ ప్రజలు కైలాసానికి మధ్య చిరకాల స్నేహ సంబంధాలకోసం నేను ఎదురుచూస్తున్నాను. పరమశివుని ఆశీస్సులు చైనా ప్రజలపై ఉండాలి’ అంటూ నిత్యానంద ట్వీట్ లో పేర్కొన్నాడు.

Non-bailable warrant against Nithyananda: ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామిజీకి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

నిత్యానంద 1978 జనవరి 1న తమిళనాడులో జన్మించాడు. 12వ ఏట నుంచి రామకృష్ణ మఠంలో విద్యాభ్యాసం ప్రారంభించాడు. 2003లో నిత్యానంద మొదటి ఆశ్రమాన్ని బెంగుళూరు సమీపంలోని బిడాడిలో ప్రారంభించాడు. 2010లో అతనిపై అశ్లీల, చీటింగ్ కేసు నమోదైంది. అరెస్టు తరువాత బెయిల్ పై బయటకు వచ్చాడు. అదే ఏడాది ఒక అమెరికన్ మహిళ నిత్యానంద తనపై ఐదేళ్లపాటు మతంపేరుతో అత్యాచారం చేశారని ఆరోపించింది. 2012లోనూ నిత్యానందపై మళ్లీ అత్యాచార ఆరోపణలు వచ్చాయి. పలు కేసుల్లో నిత్యానందకు శిక్ష విధించబడింది. 2019లో గుజరాత్ కు చెందిన జనార్దన్ శర్మ, అతని భార్య తమ ఇద్దరు కుమార్తెలను కిడ్నాప్ చేసి బంధీగా ఉంచారని నిత్యానందపై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆ తరువాత నిత్యానంద దేశం నుంచి పారిపోయాడు.

 

ట్రెండింగ్ వార్తలు