China Yuan: డాలర్‌కు మూడిందా? అమెరికాను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు ఇరాన్ దిమ్మతిరిగే వ్యూహం..
యుద్ధం ఆగాలంటే అమెరికా డాలర్ ఆధిపత్యానికి గండి పడాల్సిందేనని కోరుకుంటోంది. ప్రపంచ దేశాలకు కూడా ఇలాంటి పిలుపే ఇస్తోంది ఇరాన్.
- Naveen
- Published On : March 14, 2026 / 08:31 PM IST
Representative Image (Image Credit To Original Source)
- అమెరికా డాలర్ ఆధిపత్యానికి గండికొట్టేందుకు ఇరాన్ ప్రణాళికలు
- డాలర్ల రూపంలో కాకుండా చైనా కరెన్సీ రూపంలో చమురు కొనుగోళ్లు
- యుద్ధం ఆగాలంటే అమెరికా డాలర్ ఆధిపత్యానికి గండి పడాల్సిందే
China Yuan: అమెరికా, ఇరాన్ యుద్ధం మెల్లగా చమురు నుంచి ఆర్థిక యుద్ధంగా రూపాంతరం చెందుతోందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఈ యుద్ధం ద్వారా అమెరికా డాలర్ ఆధిపత్యానికి గండికొట్టాలని ఇరాన్ ప్రణాళికలు రచిస్తోంది. ప్రపంచ దేశాలకు కూడా ఇలాంటి పిలుపే ఇస్తోంది ఇరాన్. రానున్న రోజుల్లో చమురు కొనుగోళ్లు డాలర్ల రూపంలో కాకుండా చైనా కరెన్సీ యువాన్ లేదా ఇతర విదేశీ కరెన్సీల్లో చేసే దిశగా అడుగులు వేస్తోంది.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా ఖర్గ్ ఐలాండ్ పై అమెరికా దళాలు దాడులు చేశాయి. ఆ ద్వీపంలోని సైనిక స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నారు. అయితే, ఇరాన్ మాత్రం దాడి జరిగిందని, కానీ చమురు మౌలిక సదుపాయాలకు ఎలాంటి హాని కలగలేదని చెబుతోంది. అంతేకాదు యూఎస్ కు గట్టి హెచ్చరికలే చేసింది ఇరాన్.
మ క్రూడాయిల్ ఇన్ఫాస్ట్రక్చర్ పై దాడులను చాలా తీవ్రంగా పరిగణిస్తామని, అలా చేస్తే అమెరికాతో సంబంధం ఉన్న ఏ చమురు కంపెనీల ఇన్ఫాస్ట్రక్చర్ ను అయినా వదిలి పెట్టే ప్రసక్తే లేదని గట్టి వార్నింగ్ ఇస్తోంది. అదే సమయంలో యుద్ధం ఆగాలంటే అమెరికా డాలర్ ఆధిపత్యానికి గండి పడాల్సిందేనని కోరుకుంటోంది. ప్రపంచ దేశాలకు కూడా ఇలాంటి పిలుపే ఇస్తోంది ఇరాన్.
రానున్న రోజుల్లో చమురు కొనుగోళ్లు డాలర్ల రూపంలో కాకుండా మిగతా విదేశీ కరెన్సీల్లో చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. అదే జరిగితే అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థకు బిగ్ షాక్ ఇచ్చినట్లే. ఎందుకంటే ఇప్పటివరకు ప్రపంచ దేశాలన్నీ చమురు కొనుగోళ్లకు డాలర్ల రూపంలోనే చెల్లింపులు చేస్తున్నాయి. దీంతో యూఎస్ డాలర్ బలపడటమే కాకుండా ఆర్థికంగా అమెరికా బాగా లాభపడుతోంది. ఇకపై డాలర్ మినహా ఏ విదేశీ కరెన్సీలో అయినా ఆయిల్ ట్రేడ్ చేయాలని ఇరాన్ అనుకుంటోంది. ముఖ్యంగా చైనా కరెన్సీ యువాన్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్న యోచనలో ఉంది. ఆసియా, యూరప్, ఆఫ్రికా దేశాలకు ఇరాన్ అధికంగా చమురు సరఫరా చేస్తుంటుంది.
ఇప్పటికే ఈ యుద్ధం కారణంగా అమెరికాకు లక్షల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఇప్పుడు హార్ముజ్ జలసంధి మూసివేతతో ఇరాన్ కూడా యుద్ధాన్ని ప్రపంచ చమురు సంక్షోభంగా మార్చింది. ఇకపై ఆర్థిక యుద్ధంతో అమెరికా మెడలు వంచాలన్న గట్టి పట్టుదలతో ఉంది ఇరాన్.
Also Read: నెతన్యాహు చనిపోయారా? 3 వారాలుగా యుద్ధం జరుగుతున్నా కనిపించని ఇజ్రాయెల్ ప్రధాని
