Taliban on Osama bin Laden – 9/11 దాడుల్లో లాడెన్ పాత్ర ఉన్నట్లు సాక్ష్యం లేదు – తాలిబాన్

యుద్ధం జరిగిన 20ఏళ్ల తర్వాత కూడా ఒసామా బిన్ లాడెన్ పాత్ర ఉన్నట్లు ఒక్క సాక్ష్యం కూడా లేదు. ఆ యుద్ధానికి సరైన న్యాయం జరగలేదు. అమెరికన్లను చూసి యుద్ధం ముగించాం.

Taliban On Osama Bin Laden

Taliban on Osama bin Laden: సెప్టెంబర్ 11 ఉగ్రదాడుల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఉసామా బిన్ లాడెన్ పాత్ర లేదని తాలిబాన్లు చెప్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ లో జరిగిన ఉగ్రదాడుల్లో లాడెన్ ఇన్వాల్వ్ కాలేదని అంటున్నారు. తాలిబాన్ అధికార ప్రతినిధి జబీబుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. ‘యుద్ధం జరిగిన 20ఏళ్ల తర్వాత కూడా ఒసామా బిన్ లాడెన్ పాత్ర ఉన్నట్లు ఒక్క సాక్ష్యం కూడా లేదు. ఆ యుద్ధానికి సరైన న్యాయం జరగలేదు. అమెరికన్లను చూసి యుద్ధం ముగించాం’ అని ముజాహిద్ అన్నారు.

9/11 లాంటి అటాక్స్ మళ్లీ అఫ్ఘానిస్తాన్ వేదికగా జరగవని తాలిబాన్లు గ్యారంటీ ఇవ్వగలరని అన్నారు.

‘లాడెన్ వాళ్లకు సమస్యగా మారినప్పుడు అమెరికన్లు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. అప్పుడు లాడెన్ అఫ్ఘానిస్తాన్ లో ఉన్నారు. ఆ దాడుల వెనుక ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నట్లు కూడా ఎటువంటి సాక్ష్యం లేదు. అఫ్ఘానిస్తాన్ మట్టిని అటువంటి పనులకు వాడమని హామీ ఇస్తున్నాం. మహిళలను గౌరవిస్తాం. వాళ్లు మా సోదరీమణులు. వాళ్లు భయపడాల్సిన అవసరం లేదు. తాలిబాన్లు దేశం కోసం పోరాడారు. అది చూసి మహిళలు గర్వపడాలి. భయం కాదు’

వేల కొద్దీ అఫ్ఘాన్లు దేశం వదలి పారిపోతున్నారని అడిగిన ప్రశ్నకు.. ‘మా దేశస్థులు పారిపోవాలని మేం కోరుకోవడం లేదు. గతంలో వాళ్లు చేసిన పనులను క్షమించేశాం. దేశం కోసం యువత, చదువుకున్న వాళ్లు కచ్చితంగా కావాలి. ఇక్కడ ఉండాలా.. వద్దా అనేది వాళ్ల ఛాయీస్ కే వదిలేశాం’ అని ముజాహిద్ చెప్తున్నారు.