Afghan Women: మగతోడు లేకుండా మహిళల ప్రయాణం వద్దనడానికి కారణమిదే

అఫ్ఘానిస్తాన్ లోని తాలిబాన్ అధికారులు ఆదివారం కొత్త ఆంక్షలు విధించారు. కొద్దిపాటి దూరాలు మినహాయించి సుదీర్ఘ ప్రయాణాలు చేయాల్సి వస్తే మగతోడు ఉండాల్సిందేనంటూ రూల్ తీసుకొచ్చారు.

Afghan Women: అఫ్ఘానిస్తాన్ లోని తాలిబాన్ అధికారులు ఆదివారం కొత్త ఆంక్షలు విధించారు. కొద్దిపాటి దూరాలు మినహాయించి సుదీర్ఘ ప్రయాణాలు చేయాల్సి వస్తే మగతోడు ఉండాల్సిందేనంటూ రూల్ తీసుకొచ్చారు. ధర్మ ప్రోత్సాహ, దుర్మార్గ నివారణలో భాగంగా సంబంధిత మంత్రిత్వ శాఖ ఈ ఆర్డర్ ఇష్యూ చేసింది. అంతేకాకుండా హిజాబ్ ధరించే మహిళలనే తమ వాహనాల్లోకి అనుమతివ్వాలని వాహన యజమానులకు పిలుపునిచ్చారు.

‘మహిళలు 72కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తే వారు సన్నిహితులైన కుటుంబ సభ్యుల తోడు తీసుకోవాల్సిందే’ అని సాదెఖ్ అకీఫ్ ముహజీర్ తెలిపారు.

సోషల్ మీడియా నెట్‌వర్క్ లలో ఈ గైడ్ లెన్స్ సర్క్యూలేట్ అవుతుంది. కొద్ది వారాల క్రితమే సబ్బు యాడ్ లలో భాగంగా మహిళా యాక్టర్లు కనిపించే అడ్వర్టైజ్మెంట్ లను ఆపేయాలంటూ ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా టీవీ జర్నలిస్టులైన మహిళలు టీవీల్లో కనిపించేటప్పుడు తప్పకుండా హిజాబ్ ధరించాలని సూచించారు.

rEAD aLSO : నక్సలైట్ గెటప్‌లో హల్‌చల్ చేసిన ఆర్జీవీ

వాహనాల్లో ప్రయాణించే వారు కూడా హిజాబ్ పాటించాలని తల వెంట్రుకల నుంచి ముఖం, పూర్తిగా కప్పి ఉంచేలా డ్రెస్సింగ్ ఉండాలని అన్నారు. వాహనాల్లో మ్యూజిక్ పెట్టుకోవడాన్ని కూడా నిషేదిస్తున్నట్లు తెలిపారు. 1990ల్లో అధికారంలోకి వచ్చిన తాలిబాన్లు కొన్నేళ్ల తర్వాత మరోసారి అధికారం చేజిక్కించుకుని అఫ్ఘాన్లను పాలిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు