మిగిలిన ఫ్లూలతో పోలిస్తే కోవిడ్-19 అంత ఉధృతంగా ఏం ఉండదు. వైరస్ సోకిందని తెలియడానికే వారం పట్టొచ్చు. ప్రభావంకూడా నెమ్మదిగానే కనిపిస్తుంది. కాకపోతే, వ్యాప్తిలో చాలా వేగం ఎక్కువ. మరి అడ్డుకొనేదెలా? డాక్టర్ల దగ్గర తక్షణ ఉపాయముంది. దేన్నీ ముట్టుకోకూడదు. గంటకోసారి చేతులను 20 సెకండ్లపాటు కడుక్కోవాలి. మాస్క్ వేసుకోవాలి. లేదంటే, దగ్గనప్పుడు, తుమ్మినప్పుడు ఖర్జీఫ్ వాడాలి. అనారోగ్యంతో ఉన్నవాళ్లకు దూరంగా ఉండాలి.
కరోనాను అడ్డుకోవడానికి ఈ టెక్నిక్స్ పనిచేస్తాయి. ఎందుకంటే, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటిలోంచి వచ్చే చిన్నచిన్న తుంపర్లు గాల్లోకి కలసి, కనీసం 3-6అడుగుల దూరంలోని వాళ్లను చేరుతాయి. ఒకవేళ గాల్లోని వైరస్ కనుక పక్కనున్నవాళ్లను చేరితే, వాళ్లకూ కరోనా వస్తుంది.
Also Read | కరోనా ఎఫెక్ట్: ఒకరికి పాజిటివ్.. మూతబడిన హ్యూండాయ్
గాల్లోనేకాదు, వైరస్ ఏక్కడ చేరినా అదిబతుకుతుందని, చాలారోజుల పాటు వ్యాపించడానికి సిద్ధంగా ఉంటుందని యూనివర్సిటీ ఆప్ టెన్నసీ హెల్త్ సైన్స్ సెంటర్ లో immunologistగా కరోనా వైరస్‌ను స్టడీ చేస్తున్న రుద్ర చన్నప్పనావర్ అంటున్నారు. ముఖ్యంగా గ్లాస్ మీదైతే ఎక్కువకాలం దర్జాగా బతుకుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు. అంటే మనం వాడుతున్న మొబైల్ కూడా వైరస్‌ను వ్యాపించే అవకాశమూ ఉంది. ఎవరో దగ్గారు. ఫోన్ మీద చేరితే వైరస్ నాలుగురోజుల పాటు 96 గంటపాటు అది బతికే ఉంటుంది. మనం ఫోన్ ను టచ్ చేసినప్పుడు చేతి నుంచి, నోటికి చేరుతుంది. కరోనా వైరస్ వస్తుంది.
అసలు చైనా వెళ్లలేదు, తెలిసినవాళ్లెవరీ కరోనా లేదు, అయినా కొందరికి ఎందుకు వస్తుంది? అన్న ప్రశ్నకు సమాధానమిది. ఒకవేళ జపాన్ లో ఫోన్ మీద కరోనా వైరస్ చేరితే అదికాస్తా అమెరికా, యూరోప్ దేశాలకు చేరిందనుకొందాం. దాన్ని వాడినవాళ్లకు కరోనా వచ్చే అవకాశాలెక్కువ. అంటే ఫోన్‌కూడా కరోనాను వ్యాపిస్తుందన్న అంచనా వైద్య నిపుణులది. అందుకే ఫోన్‍ను కూడా ప్రతిరోజూ క్లీన్ చేయాల్సిందేనని సలహానిస్తున్నారు.
See Also | ఫిబ్రవరి 29: ఎందుకు ప్రత్యేకం.. ఈరోజు పుట్టినవారికి ఉండే నైపుణ్యం ఏంటీ?