Nuclear Attack Key Who Will Have Key Order To Launch Nuclear Attack From Russia, China And Britain (3)
Nuclear Attack Key : ప్రపంచ దేశాల్లో చాలావరకు సొంత అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. అయితే ఆ అణ్వాయుధాలను ఎప్పడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ప్రయోగించడానికి వీలుంటుందా? అణుబాంబుల ప్రయోగానికి ఎవరి అనుమతి తీసుకోవాలి? ఆదేశాలు ఎవరూ ఇస్తారు.. ఎవరి దగ్గర అణ్వాయుధాల ప్రయోగానికి తాళం చెవి ఉంటుందనేది అంతుపట్టని ప్రశ్నగానే చెప్పాలి. ఎందుకంటే.. అణ్వాయుధాలను ప్రయోగించే ముందు దానికి సంబంధించి పూర్తి సమాచారం ఎవరి దగ్గర ఉంటుంది.. ఈ ప్రాసెస్ ఎలా చేస్తారు అనేది అంతా మిసైల్ లాంచ్ అధికారులకే బాగా తెలుసుంటారు. ఇప్పుడు యుక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలోనూ అణుబాంబులను ప్రయోగించే పరిస్థితి కనిపిస్తోంది. రష్యా యుక్రెయిన్ అణు విద్యుత్ కేంద్రాలపై దాడులకు తెగబడుతోంది.
ఏ క్షణమైన అణు యుద్ధానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ సై అన్నట్టుగా కనిపిస్తున్నారు. ఒకవేళ.. అణ్వాయుధాలను ప్రయోగించాల్సి వస్తే.. అగ్రరాజ్యం అమెరికా సహా రష్యా, చైనా, బ్రిటన్ వంటి దేశాల్లో ఎవరి కంట్రోల్ ఉంటాయో తెలుసుకుందాం. రష్యా యుక్రెయిన్ యుద్ధం విషయానికి వస్తే.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గత ఫిబ్రవరి 24న యుక్రెయిన్ పై దండయాత్ర ప్రకటించారు. కొన్నిరోజుల తర్వాత ఫిబ్రవరి 27న తమ అణ్వాయుధాలను ప్రయోగించనున్నట్టు ప్రకటించారు. ప్రపంచంలో అణ్వాయుధ నిల్వలు ఎక్కువ రష్యా దగ్గరే ఉన్నాయి. రష్యా అణుయుద్ధ ప్రకటనతో ప్రపంచ వినాశనం తలెత్తవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అణ్వాయుధాలను ప్రయోగించడానికి ఏయే ప్రొటోకాల్స్ పాటించాలి.. అసలు ఈ అణు ఆయుధాన్ని ప్రయోగించే కీ ఎవరిదగ్గర ఉంటుంది.. ఈ మూడు దేశాల్లోని అణ్వాయుధాలను ఎవరూ ప్రయోగిస్తారు అనేది చెప్పడం కష్టమేనని అంటున్నారు విశ్లేషకులు.
Nuclear Attack Key : అమెరికాలో అధ్యక్షుడే ఆదేశాలిచ్చేది..
అమెరికా న్యూక్లియర్ ఫుట్ బాల్.. అంటే ఏంటి.. అది ఎవరి దగ్గర ఉంటుంది.. ఎవరూ లాంచ్ చేస్తారంటే.. బ్రూస్ బ్లా అమెరికాకు చెందిన మాజీ మిసైల్ లాంచ్ అధికారి ఉండేవారు. 70వ దశాబ్దంలో అమెరికా రహస్య అణు క్షిపణుల స్థావరాల్లో పనిచేశారు. వీరిని మినిట్ మాన్ అంటారు. ఆదేశాలు రాగానే క్షణాల వ్యవధిలోనే అణు క్షిపణులను పేల్చేస్తారు.. మిసైల్ లాంచ్ కు సంబంధించి ఏ క్షణమైనా ఆదేశాలు వస్తాయని ముందుగానే అలర్ట్ గా ఉంటారు. అణు బాంబు లాంచింగ్ ఆపరేటింగ్ చేసేందుకు ఒక కంప్యూటర్ మానిటర్ కూడా ఉంటుంది. వాస్తవానికి.. అమెరికా వ్యవస్థలో అణ్వాయుధాలు ప్రయోగించాలంటే అధ్యక్షుడు మాత్రమే ఆదేశాలు ఇచ్చే అధికారం ఉంది. అమెరికా అధ్యక్షుడితో ప్రతి క్షణం కొందరు వ్యక్తులు ఉంటుంటారు. వీరి దగ్గర ఒక బ్రీఫ్‌కేస్ కూడా ఉంటుంది. దీన్నే న్యూక్లియర్ ఫుట్‌బాల్ అని పిలుస్తారు. నలుపురంగులో ఉండే ఈ బ్రీఫ్ కేసులో కొన్ని స్పెషల్ టూల్స్ ఉంటాయి. అధ్యక్షుడి ఆదేశాలను అమలు చేసేందుకు ఈ టూల్స్ వినియోగిస్తారు. బ్రీఫ్‌కేసులో కార్టూన్ పుస్తకంలా ఉంటుంది. గ్రాఫిక్స్ ద్వారా వార్ ప్లాన్, అణు క్షిపణులు, లక్ష్యాల వివరాలు ఉంటాయి. ఒకవేళ అణు క్షిపణి ప్రయోగిస్తే.. ఎంతమంది ప్రజలు చనిపోతారో కూడా అంచనా వేయవచ్చు.
Nuclear Attack Key Who Will Have Key Order To Launch Nuclear Attack From Russia, China And Britain
Nuclear Attack Key : రష్యాలోనూ అధ్యక్షుడే ఆదేశాలిచ్చేది..
రష్యా కూడా ఒక న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ కలిగి ఉంది. దీనిద్వారానే అణు ప్రయోగాలకు వినియోగిస్తుంటారు. రష్యాకు చెందిన ఇగోర్ సజెగెన్ ఆయుధ నిపుణులు ఉండేవారు. అమెరికా న్యూక్లియర్ ఫుట్ బాల్ మాదిరిగానే రష్యా అధ్యక్షుడు దగ్గర కూడా అచ్చం అలాంటి బ్రీఫ్ కేస్ ఉంటుంది. అది అణు క్షిపణి కోడ్ లోడ్ అయి ఉంటుంది. ఈ బ్రీఫ్‌కేస్ అధ్యక్షుడికి దగ్గరే ఉంటుంది. అధ్యక్షుడు నిద్రపోతున్నా సరే ఆయనకు 10-20 మీటర్ల దూరంలోనే ఉంటుంది. రష్యాపై ఏ దేశమైని దండెత్తి వస్తే.. వెంటనే ఇందులోని అలారం మోగుతుంది. అప్పుడు వెంటనే అధ్యక్షుడు బ్రీఫ్‌కేస్ దగ్గరకు వెళ్తాడు.. ఆ తర్వాత దేశ ప్రధాని, రక్షణ మంత్రిని సంప్రదిస్తారని ఆయుధ నిపుణులు ఇగోర్ తెలిపారు. ఇలాంటి బ్రీఫ్ కేస్ మాదిరిగానే మరో రెండు బ్రీఫ్ కేసలు ఉంటాయట.. ఒకటి రష్యా ప్రధానమంత్రి దగ్గర ఉంటే.. మరోకటి రక్షణమంత్రి దగ్గర ఉంటాయి.. అయితే ఈ మూడు బ్రీఫ్‌కేసులో కేవలం అధ్యక్షుడి బ్రీఫ్ కేస్ నుంచి మాత్రమే ఆదేశాలు ఇచ్చేందుకు వీలుంటుంది. ఆయనే సుప్రీం కమాండర్ గా వ్యవహరిస్తారని ఇగోర్ చెప్పుకొచ్చారు. అణు ప్రయోగానికి ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు అధ్యక్షుడు ఆ బ్రీఫ్ కేస్ తెరిచి అందులోని సీక్రెట్ కోడ్ యాక్టివ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంగా ఒకసారి మాత్రమే రష్యాకు వచ్చింది.
Nuclear Attack Key Who Will Have Key Order To Launch Nuclear Attack From Russia, China And Britain
Nuclear Attack Key : బ్రిటన్ అణు క్షిపణులు.. ప్రధాని మాత్రమే ఆదేశిలిచ్చేది..
బ్రిటన్‌లో ట్రైడెంట్ క్షిపణుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. బ్రిటన్ దగ్గర నాలుగు శక్తివంతమైన సబ్ మెరైన్లు ఉన్నాయి. బ్రిటన్ ఎప్పుడైనా ఇతర దేశాలపై క్షిపణులతో దాడి చేయాల్సి వస్తే.. అందులో ఒకటి ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. నార్త్ అట్లాంటిక్ మహాముద్రంలో మోహరించే ఉంటుంది. ఏ కొంచెం చిన్న సంకేతం అందినా క్షణాల వ్యవధిలో అణుదాడి చేయగలదు. అయితే ఈ జలాంతర్గామి నార్త్ అట్లాంటిక్ జలాల్లో ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు. ఎవరికీ కూడా దాని జాడ తెలియదు.. ఇతరులు తెలుసుకోవడం కూడా అసాధ్యమే అని చెప్పాలి. బ్రిటన్ వ్యవస్థలో అణు క్షిపణి లాంచ్ చేయాల్సి వస్తే.. ఆ ఆదేశాలు కేవలం బ్రిటన్ ప్రధాని మాత్రమే ఇవ్వగలరు. ఆయన ఆదేశాలతో రాయల్ నేవీ వాన్ గార్డ్ క్లాస్ జలాంతర్గామి అణు దాడులను ప్రారంభిస్తుందని ప్రొఫెసర్ పీటర్ తెలిపారు. మిస్సైల్ లాంచ్ చేసే ముందు నౌకాదళ అధికారులకు బ్రిటన్ ప్రధాని ఒక స్పెషల్ కోడ్ పంపుతారు. వారిదగ్గర కూడా ఒక స్పెషల్ కోడ్ ఉంటుంది. ఈ ముగ్గురు తమ కోడ్ చెప్పినప్పుడే అణు క్షిపణి లాంచ్ చేయడానికి యాక్సస్ చేసుకోవచ్చు. అనంతరం ఆ కోడ్ లండన్ లోని ఒక బంకర్ దగ్గర యాక్సస్ చేస్తారు. ఆ బంకర్ నుంచే మహాసముద్రంలోని జలాంతర్గామికి అణు క్షిపణి లాంచ్ చేసేందుకు ఆదేశిలిస్తారు. వైర్ లెస్ ద్వారా ఈ మెసేజ్ అందగానే ఆ కోడ్స్ తో లాంచింగ్ యాక్సస్ చేస్తారు.
Nuclear Attack Key Who Will Have Key Order To Launch Nuclear Attack From Russia, China And Britain
Nuclear Attack Key : చైనాలో లోతైన సొరంగాలు.. అణుదాడి ఆదేశాలిచ్చేది ఎవరంటే..!
డ్రాగన్ చైనా ప్రపంచంలోనే అణుశక్తి కలిగిన దేశాల్లో ఒకటిగా ఉంది. అయితే చైనా పాలసీ ఎప్పుడూ అణుదాడి కానే కాదు.. ఎందుకంటే.. చైనా దగ్గర ముందుగానే అణుదాడులను గుర్తించగల సామర్థ్యం లేదంట.. అణుదాడికి పాల్పడేందుకు ముందు అసలు అణు దాడి తమదేశంపై జరిగిందా లేదా అని అంచనా వేస్తుంది. ఆ తర్వాతే ఒక నిర్ణయానికి వస్తుంది. ఎదురుదాడి ఎలా చేయాలి అనేది ఆలోచిస్తుందని కార్నెగీ చిన్హువా అనే వ్యక్తి తెలిపారు. శత్రు దేశం అణుదాడి చేసి.. చైనాలోని అగ్రనేతలు, సైనిక కమాండర్లు అందరూ చనిపోయినా అణు క్షిపణులు కూడా ధ్వంసమైనప్పుడు చైనా ఏం చేస్తుందో కూడా ఆయన వివరించారు. అణు దాడికి ముందే చైనా అన్ని సన్నద్ధం చేసుకుంటుంది. అందుకోసం లోతైన సొరంగాలను ఏర్పాటు చేసుకుంది. కొన్ని వందల మీటర్ల లోతులో ఈ సొరంగాలను నిర్మించుకుందట.. భూమిపై యుద్ధం వాతావరణం నెలకొన్న సమయంలో సొరంగాల్లో నుంచి చైనా అణు దాడికి సంబంధించి నిర్ణయాలను తీసుకుంటుంది. అయితే అణుదాడిపై నిర్ణయం ఎవరి చేతుల్లో ఉంటుందంటే.. ఇదంతా చాలా సీక్రెట్ గా ఉంచుతారట.. సైన్యానికి ఆదేశాలిచ్చేది మాత్రం కమ్యనిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరీ స్టాండింగ్ కమిటీ ఉంటుందట.. అణు దాడిపై నిర్ణయం చైనా అధ్యక్షుడి చేతిలో ఉంటుందా లేదా అనేది ఎవరికీ తెలియదని అంటున్నారు.
అణుదాడి జరిగిన వెంటనే చైనా అణుదాడి చేయదట.. కొన్నిరోజులు గ్యాప్ ఇస్తుందట.. ఆ తర్వాత ఒక్కసారిగా ఎదురుదాడి చేస్తుందట.. మొదట అణు దాడి చేయాలనేది చైనా పాలసీ కాదనే ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. మరో విషయం ఏమిటంటే.. రష్యా సహా ఇతర దేశాల మాదిరిగానే అణుదాడికి చైనా అధ్యక్షుడే ఆదేశాలిచ్చే అధికారం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో చైనా కూడా అణు దాడి మొదట చేయకూడదనే విధానాన్ని మార్చుకునేలా కనిపిస్తోంది. ప్రస్తుత టెక్నాలజీకి తగినట్టుగా చైనా సైతం హైపర్‌సోనిక్ టెక్నాలజీని వాడుతోంది. అణ్వాయుధ నిల్వలను పెంచుకుంటోంది. ఏది ఏమైనా.. హీరోషిమా నాగసాకిపై అణుదాడి జరిగిన తర్వాత ప్రపంచంలో ఎన్నోసార్లు పలు దేశాలు అణుయుద్ధం వరకు వెళ్లాయి. కానీ, ఇప్పటివరకూ ఏ దేశ అధ్యక్షుడు అణు దాడులకు ఆదేశాలివ్వలేదు. కానీ, ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ అణ్వాయుధాలను సిద్ధం చేయండని ఆదేశాలివ్వడంతో ప్రపంచ అణుయుద్ధం మొదలైందనే ఆందోళనలను రేకిత్తించింది. అణుబాంబు ప్రయోగిస్తే ఆ దేశమే కాదు.. మొత్తం ప్రపంచమే సర్వనాశనం అయిపోతుంది.
Read Also : Ukraine Nuclear Plants : అణుయుద్ధం ప్రమాదపు అంచులో యుక్రెయిన్.. పేలితే భారీ వినాశనమే..!