Nuclear Weapons War : అణ్వాయుధాలంటే ఏంటి? ఏయే దేశాల్లో ఎన్ని అణుబాంబులు ఉన్నాయంటే?

అణుబాంబు వేస్తే చాలు... అది సృష్టించే వినాశనం అంతాఇంతా కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాల్లో ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి.. ఎన్ని దేశాలు అణుబాంబులను పరీక్షించాయో తెలుసుకుందాం.. 

Nuclear Weapons War What Countries Are The Nuclear Powers Of The World How Many Nuclear Weapons Are There

Nuclear Weapons War : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటివరకూ క్షిపణలు, డ్రోన్లు, ఇతర బాంబులతో యుద్ధం కొనసాగింది. యుక్రెయిన్ ప్రతిఘటన బలంగా ఉండటంతో రష్యా అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశాడు. అణ్వాయుధాలను ప్రయోగిస్తామంటూ పుతిన్ ప్రకటనతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. అదేగానీ జరిగితే ఊహించని పరిణామాలు, వినాశనానికి దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అణ్వాయుధాలను ప్రయోగిస్తే అది ఎంత ప్రమాదమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే.. ప్రపంచంలో జరిగిన తొలి అణ్వాయుధ పరీక్ష ఇప్పటికీ మర్చిపోలేనిది. అమెరికాలో న్యూమెక్సికోలోని అలోమాగార్డో ఎయిర్ బేస్‌లో 1945 జులై 16వ తేదీన అణ్వాయుధ పరీక్ష జరిగింది. ట్రినిటీ అనే కోడ్‌తో నిర్వహించిన ఈ పరీక్షను నిర్వహించి సరిగ్గా 76 ఏళ్లు అవుతుంది.

ఈ అణ్వాయుధ పరీక్ష జరిగిన కొన్నివారాల్లోనే అదే ఏడాదిలో ఆగస్టు 6న మరో అణుబాంబు పరీక్ష జరిగింది. అది ఎక్కడో కాదు.. జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకి (Hiroshima and Nagasaki) మీదనే.. అప్పుడు ఈ అణుబాంబు దాడి (Nuclear Weapons War)తో హిరోషిమాలో 90వేల నుంచి 1,66,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నాగసాకిలో 60వేల నుంచి 80వేల మంది ప్రాణాలు కోల్పోయినట్టు అంచనా. ఈ మరణాలన్నీ అణుబాంబు ప్రయోగం కారణంగానే చోటుచేసుకున్నాయి. అణు బాంబుల దాడులతో అనేక నగరాలు తుడ్చుపెట్టుకుపోయాయి. అణుబాంబు వేస్తే చాలు… అది సృష్టించే వినాశనం అంతాఇంతా కాదు.. కొన్నివేల ఏళ్ల వరకు దాని ప్రభావం ఉంటుంది. అంతటి భయానకమైన న్యూక్లియర్ ఆయుధాలను ప్రపంచంలోనే వినాశకరమైన ఆయుధాలుగా చెబుతుంటారు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాల్లో ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి.. ఎన్ని దేశాలు అణుబాంబులను పరీక్షించాయో తెలుసుకుందాం..

అణ్వాయుధాలు (Nuclear Weapons War) అంటే ఏంటంటే? :
అణు బాంబులు.. చాలా శక్తిమంతమైన పేలుడు పదార్థాలు.. అణుబాంబు పేలితే దాని విధ్వంసం చాలా తీవ్రంగా ఉంటుంది. ఆటం, ఐసోటోప్ అనేవి వినే ఉంటారు. న్యూక్లియర్ పేలుడు కూడా ఈ రెండింటి కారణంగానే జరుగుతుంది. పరమాణు శక్తిని విస్ఫోటనం చెందిస్తే భారీ స్థాయిలో పేలుడు సంభవిస్తుంది. అలాంటి శక్తివంతమైన బాంబులను తయారు చేస్తారు. అందుకే వీటికి అణు బాంబుగా పేరొచ్చింది. న్యూక్లియర్ ఆయుధాలు పేలడం ద్వారా అందులో నుంచి అధిక మొత్తంలో రేడియేషన్ రిలీజ్ అవుతుంది. దీని కారణంగా రేడియేషన్ సిక్‌నెస్ ఏర్పడుతుంది. పేలుడు జరిగిన సమయంలో కన్నా ఆ తర్వాత కలిగే దుష్ప్రభావాలు దీర్ఘకాలంగా ఉంటాయనడంలో సందేహం లేదు.

Nuclear Weapons War What Countries Are The Nuclear Powers Of The World How Many Nuclear Weapons Are There

అణ్వాయుధాలు ఎన్ని దేశాల్లో ఉన్నాయంటే? :
ప్రపంచంలో జనవరి 2021 నాటికి తొమ్మిది దేశాలైన అమెరికా, యుకె, భారతదేశం, పాకిస్తాన్, రష్యా, ఫ్రాన్స్, చైనా, ఇజ్రాయెల్, ఉత్తర కొరియాలో న్యూక్లియర్ ఆయుధాలను కలిగి ఉన్నాయి.

ఏ దేశంలో ఎన్ని అణుబాంబులు ఉన్నాయంటే? :
ప్రపంచవ్యాప్తంగా 2021 జనవరి నాటికి 13080 అణ్వాయుధాలు (nuclear weapons) ఉన్నాయని పలు దేశాల దగ్గర ఉన్నాయని ది స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) పేర్కొంది. ప్రపంచంలో రష్యా వద్దనే అత్యధికంగా అణుబాంబులు ఉండగా.. ఉత్తర కొరియా వద్ద తక్కువగా అణుబాంబులు ఉన్నాయి. రష్యా వద్ద 6255 అణుబాంబులు ఉంటే.. అమెరికా దగ్గర 5550 అణుబాంబులు, చైనా దగ్గర 350, ఫ్రాన్స్ దగ్గర 290, బ్రిటన్ దగ్గర 225, పాకిస్తాన్ దగ్గర 165, ఇజ్రాయెల్ దగ్గర 90 అణు బాంబులు ఉన్నాయి. ఇక ఉత్తర కొరియా దగ్గర 40 నుంచి 50 అణ్వాయుధాలు ఉన్నాయని నివేదికలు అంచనా వేశాయి. ప్రపంచవ్యాప్తంగా 3825 అణ్వాయుధాలు మాత్రమే ప్రయోగానికి రెడీగా ఉన్నాయట.. అందులో అమెరికా దగ్గర 1800 ఉంటే.. రష్యా దగ్గర 1625 అణ్వాయుధాలు ఉన్నాయి. ఫ్రాన్స్ దగ్గర 280 అణ్వాయుధాలు, బ్రిటన్ దగ్గర 120 వరకు అణ్వాయుధాలు ఉన్నాయి.

అణు బాంబు పరీక్షలు ఎక్కడ జరిగాయంటే? :
అణుబాంబుల కోసం ప్రపంచ దేశాల మధ్య పోటీవాతావరణం నెలకొంది. న్యూక్లియర్ ఆయుధాల కోసం 1961లో సోవియెట్ యూనియన్ పరీక్షించిన త్సార్ (TSAR) బాంబు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బాంబుగా చెబుతుంటారు. ఈ అణుబాంబును ఆర్క్టిక్ నోవాయా జెమిలియా ద్వీపంలో సుఖోయ్ నోస్ పరీక్షా కేంద్రం నుంచి పరీక్షించారు. ఈ అణుబాంబు (Nuclear Weapons War) జరిగిన ప్రాంతం నుంచి 55 కిలోమీటర్ల దూరంలో అన్ని భవనాలను నాశనం చేసిందని కొన్ని నివేదికలు తెలిపాయి. ఈ విస్ఫోటనం కారణంగా మూడు సార్లు భూప్రకంపనలు సంభవించాయని నివేదికలు వెల్లడించాయి. ఈ అణుబాంబు ఎలా ప్రయోగించారంటే.. 8 మీటర్ల పొడవు, 27 టన్నుల బరువైన పారాచూట్ ద్వారా అణుబాంబు వదిలి ఉండవచ్చునని నివేదికలు చెబుతున్నాయి. 1952లో అమెరికా అణుబాంబుల కన్నా శక్తివంతమైన 10 మెగా టన్నుల తొలి హైడ్రోజన్ బాంబును పరీక్షించింది.

Nuclear Weapons War What Countries Are The Nuclear Powers Of The World How Many Nuclear Weapons Are There

IV Mike అనే పేరుతో పసిఫిక్ మహా సముద్రంలోని మార్షల్ ఐలాండ్స్‌లో ఈ హైడ్రోజన్ బాంబును పరీక్షించారు. ఈ పేలుడు కారణంగా కమ్మిన ధూళి మేఘాలతో సుమారు 50 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించాయి. ఫలితంగా ఎలుగెలాబ్ ద్వీపాన్ని పూర్తిగా నాశనమైపోయింది. 1954లో మార్షల్ ఐలాండ్స్‌లో బికినీ ఆటోల్‌లో కాసిల్ బ్రావో అమెరికా అతిపెద్ద అణు బాంబును ప్రయోగించింది. ఈ పేలుడుతో పుట్టగొడుగు మాదిరి మబ్బులు కొన్ని మైళ్ల దూరం వరకు వ్యాపించాయి. అణుబాంబుతో రేడియేషన్ 11,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించింది. భారతదేశంలోనూ అణు పరీక్షలు జరిగాయి. దికూడా 1974లోని రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో తొలిసారి భూగర్భ అణు పరీక్షలు జరిగాయి. చరిత్రలో అణుబాంబులను రెండవ ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో జపాన్ మీద 1945లో రెండు సార్లు ప్రయోగించారు.

ఈ అణుబాంబులను ఎవరూ తయారుచేయగలరంటే? :
ఈ అణుబాంబులను తయారు చేయడానికి టెక్నాలజీ, నైపుణ్యం, సౌకర్యాలు ఉంటే చాలు.. ఎవరైనా ఈజీగా తయారుచేసుకోవచ్చు. కానీ, అణ్వాయుధాల తయారీని ఎన్ని పడితే అన్ని తయారుచేసుకోకుండా ప్రపంచ దేశాల మధ్య ఒప్పందం ఉంది. అదే.. అణు నిరాయుధీకరణ ఒప్పందం.. ఈ ఒప్పందాన్ని అన్ని దేశాలు తప్పక పాటించాల్సి ఉంటుంది. ఈ ఒప్పందంలో 1970 నుంచి సుమారు 191 దేశాలు భాగస్వాములై ఉన్నాయి. జనవరి 1వ తేదీ 1967లో ఈ ఒప్పందానికి ముందే అమెరికా, చైనా, రష్యా, యుకె, ఫ్రాన్స్ అణ్వస్త్ర కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టాయి. దాంతో ఈ 5 దేశాలు మాత్రమే అణ్వాయుధాలను సమకూర్చుకునే హక్కును సొంతం చేసుకున్నాయి. ఈ దేశాలకు కూడా పరిమితి విధించారు. 1986లో 70వేల వరకు మాత్రమే ఉన్న అణ్వాయుధాలు దాదాపు 14వేలకు చేరుకున్నాయి.

Read Also : Russia – UKraine War: మిగిలింది అణు బాంబుల దాడేనా.. ప్రపంచ వినాశనం తప్పదా