Australia : పడవను ఢీకొన్న తిమింగలం…ఒకరి మృతి, మరొకరికి గాయాలు

ఆస్ట్రేలియా సముద్రంలో భారీ తిమింగలం పడవను ఢీకొన్న ఘటన శనివారం జరిగింది. తూర్పు ఆస్ట్రేలియా తీరంలో శనివారం తెల్లవారుజామున ఓ తిమింగలం పడవను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి....

Whale Strikes Boat

Australia : ఆస్ట్రేలియా సముద్రంలో భారీ తిమింగలం పడవను ఢీకొన్న ఘటన శనివారం జరిగింది. తూర్పు ఆస్ట్రేలియా తీరంలో శనివారం తెల్లవారుజామున ఓ తిమింగలం పడవను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. (Whale Strikes Boat Off Australia) సిడ్నీకి ఆగ్నేయంగా 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న లా పెరౌస్ సముద్రంలో శనివారం ఉదయం 6 గంటలకు భారీ తిమింగలం పడవను ఢీకొట్టింది. దీంతో పడవ పల్టీలు కొట్టినప్పుడు ఇద్దరు వ్యక్తులు పడవలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

Pakistani politicians : లైవ్ టీవీ షోలో పాక్ రాజకీయ నేతల ముష్టి యుద్ధం

ఈ ఘటనలో మొదటి వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లి అక్కడికక్కడే మృతి చెందాడు. రెండో వ్యక్తికి వైద్యాధికారులు చికిత్స అందించడంతో ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. పడవను తిమింగలం ఢీకొనడం విషాదకరమని వాటర్ పోలీస్ యాక్టింగ్ సూపరింటెండెంట్ సియోభన్ మున్రో తెలిపారు. తిమింగలం చిన్న రన్-అబౌట్ పడవకు సమీపంలోకి వచ్చి ఢీకొట్టింది.