ఉల్లిపాయలు కోయకపోయినా కంటిలో నీరు తెప్పిస్తున్నాయి. ఈ మాట ఇటీవల సర్వ సాధారణంగా మారిపోయింది. కారణం బంగ్లాదేశ్ లో కిలో ఉల్లి డబుల్ సెంచరీ దాటేసింది. కిలో రూ.200లుగా అమ్ముతున్నారు. దీంతో ప్రజలు ఉల్లి కష్టాలు పడుతున్నారు. దీంతో ప్రజలు ఆందోళనలు చేపట్టి తమ నిరసనను వ్యక్తంచేస్తున్నారు. విమానాల ద్వారా బంగ్లాదేశ్ ఉల్లిపాయల్ని దిగుమతి చేసుకుంటున్నారు అంటే అక్కడి పరిస్థితిని ఊహించుకోవచ్చు.
దీంతో ఉల్లి వాడకాన్ని తగ్గించుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఈ క్రమంలో బంగ్లా ప్రధాని షేక్ హసీనా కూడా ఉల్లి వాడకాన్ని నిషేంధించారు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఊహించుకోవచ్చు. ఉల్లి పాయలు కనిపించకుండే జేబుకు దెబ్బ కొడుతూ మొత్తం జేబును ఖాళీ చేస్తున్నాయి. మయన్మార్, టర్కీ, చైనా,ఈజిప్ట్ నుంచి విమానాల ద్వారా బంగ్లాదేశ్ ఉల్లిపాయల్ని దిగుమతి చేసుకుంటోంది.
కాగా.. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఉల్లిపాలయ రేటు మోత మోగిస్తోంది. విశాఖపట్నంలో కిలో ఉల్లి రూ.90 దాటిపోయేలా ఉంది. ఈ క్రమంలో కాకినాడలో మాత్రం కిలో ఉల్లి రూ.40లు అమ్ముతంటే విశాఖలో మాత్రం 90 దాటే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ధరలు మరో రెండు రోజుల్లో రూ.100కు చేరుకుంటుందని వ్యాపారులు అంటున్నారు.