×
Ad

Pakistan : పాకిస్థాన్‌లో తాలిబన్ మిలిటెంట్ల దాడి, 16 మంది మృతి

  • Published On : September 7, 2023 / 09:37 AM IST

Taliban Militants Attack

Pakistan : పాకిస్థాన్ దేశంలోని చిత్రాల్ ప్రాంతంలో తాలిబన్ మిలిటెంట్లు దాడి చేశారు. అప్ఘాన్ సరిహద్దు దగ్గర జరిగిన పోరులో 16 మంది మరణించారు. అప్ఘానిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని చిత్రాల్ జిల్లాలో తమ పోస్టులపై తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని పాక్ సైన్యం తెలిపింది. అఫ్ఘాన్ తాలిబన్ మద్దతుగల ఇస్లామిస్ట్ ఫైటర్లతో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు సైనికులను ప్రాణాలు కోల్పోయారు. (Taliban Militants Attack Chitral) ఈ దాడిలో 12 మంది ఉగ్రవాదులు మరణించారని పాక్ సైన్యం తెలిపింది.

Semi-Jamili Elections : జనవరిలో ఏపీ, తెలంగాణలతో లోక్‌సభ ఎన్నికలు?

చిత్రాల్‌లోని రెండు భద్రతా చెక్‌పోస్టులపై దాడికి పాల్పడింది తామేనని పాకిస్థాన్ తాలిబన్లు ప్రకటించారు. పాకిస్థాన్‌పై దాడి చేసే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాలని తాత్కాలిక అఫ్ఘాన్ ప్రభుత్వాన్ని పాకిస్థాన్ కోరింది.

PM Modi : ఇండోనేషియాలో మోదీకి ప్రవాస భారతీయుల ఘనస్వాగతం

ఉగ్రవాదులు, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న రెండు పాకిస్థానీ సైనిక పోస్టులపై దాడి చేశారు. చిత్రాల్‌లో ఇంత పెద్ద ఎత్తున దాడి ఇంతకు ముందెన్నడూ చూడలేదని వాయువ్య పాకిస్థాన్‌కు చెందిన రసూల్ దావర్ అనే పాత్రికేయుడు చెప్పారు.