Pak Journalist: లైవ్‌లో బాలుడ్ని చెంపదెబ్బ కొట్టిన పాకిస్తాన్ మహిళా జర్నలిస్ట్

పాకిస్తాన్ మహిళా జర్నలిస్ట్ చెంపదెబ్బ సోషల్ మీడియాలో వైరల్ అయింది. లైవ్ బ్రాడ్‌కాస్టింగ్ జరుగుతుండగా అడ్డు రావడంతో పాటు తప్పుగా ప్రవర్తించిన బాలుడ్ని చెంపదెబ్బ కొట్టిందా మహిళా జర్నలిస్టు. పాకిస్తాన్ లో జరిగిన ఈ ఘటన ట్విట్టర్లో వైరల్ అయింది.

Pak Journalist

 

 

Pak Journalist: పాకిస్తాన్ మహిళా జర్నలిస్ట్ చెంపదెబ్బ సోషల్ మీడియాలో వైరల్ అయింది. లైవ్ బ్రాడ్‌కాస్టింగ్ జరుగుతుండగా అడ్డు రావడంతో పాటు తప్పుగా ప్రవర్తించిన బాలుడ్ని చెంపదెబ్బ కొట్టిందా మహిళా జర్నలిస్టు. పాకిస్తాన్ లో జరిగిన ఈ ఘటన ట్విట్టర్లో వైరల్ అయింది. జులై 9న ఆదివారం ఈద్-ఉల్-అదా (బక్రీద్) పండుగ రోజున ఈ ఘటన జరిగింది.

ఒక్క రోజులోనే 4లక్షల మంది వీడియోను చూశారు. ఆ వీడియోలో స్థానికులు మహిళను గుమిగూడారు. అందులో పిల్లలతో పాటు మహిళలు, యువకులు కూడా ఉన్నారు.

అదే సమయంలో కెమెరాకు అడ్డుగా వచ్చిన బాలుడు చేయ్యెత్తి మరో వ్యక్తిని పిలుస్తున్నాడు. అతని మాట వినిపించకపోయినా చేస్తున్న సంజ్ఞలకు జర్నలిస్టుకు కోపం వచ్చి.. చెంపదెబ్బ కొట్టింది. వెంటనే మామూలు మూడ్ లోకి వచ్చేసింది. గమ్మత్తుగా ఉన్న వీడియోను నెటిజన్లు పలు కామెంట్లతో ట్రెండింగ్ చేస్తున్నారు.

Read Also : పాకిస్తాన్‌లోనూ ప్రవక్తపై వ్యాఖ్యల కల్లోలం

కాకపోతే జర్నలిస్టు చేసిన పనికి విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆ పిల్లాడు ఎంత ఇరిటేట్ చేసినా.. అలా కొట్టడం కరెక్ట్ కాదని కామెంట్ చేస్తున్నారు.