Pak PM Sharif: పాక్ డేంజరెస్ కంట్రీ అన్న బైడెన్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన పాకిస్తాన్ ప్రధానమంత్రి

క్యాలిఫోర్నియాలోని ఇర్విన్‌లో శుక్రవారం జరిగిన డెమొక్రటిక్ కాంగ్రెషనల్ క్యాంపెయిన్ కమిటీ కార్యక్రమంలో బో బైడెన్ మాట్లాడుతూ ‘‘ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. ఈ దేశం ఇతర దేశాలతో ఎలాంటి సమన్వయం లేకుండా అణ్వాయుధాలను కలిగి ఉంది’’ అని అన్నారు. 1998 నుంచి పాకిస్తాన్ అణ్వాయుధ పరీక్షలు జరుపుతోంది. అయితే, పాకిస్తాన్ అణ్వస్త్రాలపై పాశ్చాత్య దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Pak PM Sharif: ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో పాకిస్తాన్ ఒకటంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కొట్టిపారేశారు. బైడెన్‭ సలహా టీం సరిగా లేదని, ఆయనను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన అన్నారు. ‘‘గడిచిన దశాబ్దాల్లో అణ్వాయుధాల విషయంలో పాకిస్తాన్ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వస్తోంది. అణ్వాయుధాలకు సంబంధించి దాచి పెట్టడానికి మా దగ్గర అంత పెద్ద రహస్యాలేమీ లేవు. వాటి నిర్వహణకు, రక్షణకు పరిష్టమైన భద్రతను ఏర్పాు చేశాం’’ అని పాక్ పీఎం అన్నారు.

‘‘కొన్ని సార్లు ప్రపంచంలో అనేక మార్పులు వస్తాయి. వాటి కోసం ఇప్పటికి ఉన్న బంధాలను ప్రశ్నించాల్సిన, అవమానించాల్సిన అవసరం లేదు. అమెరికాతో పాకిస్తాన్‭కు దౌత్యపరంగా, ఇతర అంశాల్లో చాలా ఏళ్ల నుంచి మంచి అనుబంధం ఉంది. అలా అని అనవసరపు వ్యాఖ్యలు చేయకూడదు. ప్రాంతీయపరమైన భద్రత, శాంతి చాలా అవసరం. అమెరికా వాటిని గౌరవిస్తుందని ఆశిస్తున్నాం’’ అని ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు.

కాగా, క్యాలిఫోర్నియాలోని ఇర్విన్‌లో శుక్రవారం జరిగిన డెమొక్రటిక్ కాంగ్రెషనల్ క్యాంపెయిన్ కమిటీ కార్యక్రమంలో బో బైడెన్ మాట్లాడుతూ ‘‘ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. ఈ దేశం ఇతర దేశాలతో ఎలాంటి సమన్వయం లేకుండా అణ్వాయుధాలను కలిగి ఉంది’’ అని అన్నారు. 1998 నుంచి పాకిస్తాన్ అణ్వాయుధ పరీక్షలు జరుపుతోంది. అయితే, పాకిస్తాన్ అణ్వస్త్రాలపై పాశ్చాత్య దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తీవ్రవాద దేశమైన పాకిస్తాన్ దగ్గర అణ్వయుధాలు ఉండటం వల్ల అవి తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

JP Nadda: అవినీతిలో కాంగ్రెస్ సృష్టించిన రికార్డులను ఆమ్ ఆద్మీ పార్టీ బద్దలు కొట్టింది: జేపీ నడ్డా

ట్రెండింగ్ వార్తలు