Shoe Attack on Pakistan Minister: Shoe Hurled at Rana Sanaullah's Car
Pakistan: పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఉల్లిపాయల ధర 500 శాతం పెరగ్గా, చికెన్ ధర దాదాపుగా రెండిందలైంది. ఇక నిత్యవసరాలన్నీ సామాన్యుడు ఖరీదు చేయలేనంత ఎక్కువకు పెరిగిపోయాయి. కేవలం ధరలు పెరగడమే కాదు, నిత్యవసరాల కొరత కూడా దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా ప్రజాగ్రహం పెల్లుబుకింది. ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో భాగంగా నిరసనకారుల కంటపడిన ఆ దేశంలోని పంజాబ్ రాష్ట్ర హోంమంత్రి చెప్పు దాడికి గురయ్యాడంటే పరిస్థితి ఎలా అర్థం చేసుకోవచ్చు.
Narendra Modi : స్పెషల్ మూమెంట్.. ప్రతి ఇండియన్ గర్వపడేలా చేశారు.. RRR టీంపై ప్రధాని మోదీ పోస్ట్..
పాకిస్తాన్ హోంశాఖ మంత్రి రాణా సనావుల్లా కాన్వాయ్‌లో ఉండగా ఓ ఆగంతకుడు షూ విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్ అసెంబ్లీ వెలుపల జరిగిందీ ఘటన. డ్రైవరు కారు నడుపుతుండగా, మంత్రి సనావుల్లా ముందు సీటులో కూర్చున్నాడు. షూ అతని కారు ముందు పడింది. భద్రతా సిబ్బంది నడుమ కారు ఆపకుండా అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయారు.
Shoe hurled at the car of Rana Sanaullah outside Punjab Assembly. pic.twitter.com/PikUHRQ6av
— Mubarak Khan (@xdeadboiii) January 10, 2023
అక్కడే ఉన్న జర్నలిస్టులు వెంటనే ఈ దాడి ఘటనను తమ కెమెరాల్లో బంధించారు. పంజాబ్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ సభ్యుడు రషీద్ హఫీజ్ డ్రైవర్ ఈ షూ విసిరినట్లు ఆరోపణలు వచ్చాయి. పంజాబ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఇలాహి విశ్వాస తీర్మానంపై రాజకీయ గందరగోళం తీవ్రరూపం దాల్చడంతో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్), పంజాబ్ సంకీర్ణ ప్రభుత్వం మధ్య చాలా రోజులుగా వాగ్వాదం కొనసాగుతోంది.