కరాచి-రావల్పిండి ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం: 16మంది సజీవ దహనం

  • Publish Date - October 31, 2019 / 05:10 AM IST

కరాచి-రావల్పిండి తేజ్గామ్ ఎక్స్ ప్రెస్ రైల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పాకిస్థాన్ లోని రహీమ్ యార్ ఖాన్ సమీపంలోని లియాకత్పూర్ లో జరిగిన ఈ ప్రమాదంలో 16మంది మృతి చెందారు. మరో 13మందికి పైగా గాయపడ్డారు. 

వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది..పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు.  ఓ ప్రయాణీకుడు రైల్లో గ్యాస్ సిలిండర్ తీసుకెళుతున్నాడనీ అది రైల్లో పేలిందనీ అందుకే ఈ ప్రమాదం జరిగిందని పాకిస్థాన్ మీడియా తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.