Pakistan: Nawaz Sharif gets trolled for wishes holi with diwali emoji
Pak: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ నెట్టింట ట్రోలింగ్ పాలవుతున్నారు. కారణం ఆయన హోలీ శుభాకాంక్షలు చెప్పడం. అదేంటీ? హోలీ శుభాకాంక్షలు చెబితే కూడా ట్రోల్ అవుతారా అనే డౌటనుమానం మీకు రావచ్చు. నిజమే.. కానీ ఆయన చెప్పిన శుభాకాంక్షల్లో దీపావళి ప్రమిద ఎమోజీని చేర్చారు. ఇక నెటిజెన్లు ఊరుకుంటారా..? ‘హోలీ రోజున దీపం ప్రతిమ ఏంటి బాబోయ్’ అంటూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు.
Ind vs Pak at UNSC: పాకిస్తాన్ వ్యాఖ్యలపై స్పందించడం కూడా దండగేనన్న ఇండియా
బుధవారం దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ దేశాల నుంచి భారతీయులకు హోలీ శుభాకాంక్షలు అందుతున్నాయి. ఇందులో భాగంగా నవాజ్ షరీఫ్ సైతం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘హ్యాప్పీ హోలీ’’ అని ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీటుకు చివరలో దీపం ఎమోజీని చేర్చారు. శుభాకాంక్షలు తెలపడం బాగానే ఉంది కానీ, పండగ ఏంటనేది కాస్త తెలుసుకుని చెప్తే ఇంకా బాగుంటుందని కొందరు సున్నితంగా చెప్తుండగా.. ‘దీపాలతో హోలీ చేసుకుంటున్న షరీఫ్’ అంటూ కొందరు ఘాటుగా స్పందిస్తున్నారు.
Happy Holi ?
— Nawaz Sharif (@NawazSharifMNS) March 6, 2023