Pahalgam Attack: ఇండియాతో పెట్టుకుంటే ఇంతే.. పాకిస్థాన్‌లో ముందుల ఎమర్జెన్సీ.. ఎంత దారుణ పరిస్థితి వచ్చిందో చూడండి..

భారత ప్రభుత్వం పాకిస్థాన్ తో వాణిజ్య సంబంధాలను నిలిపివేయడంతో ఆ దేశ ఔషద రంగంపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది.

Pakistan takes emergency steps for pharma supplies

Pahalgam terror attack: పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని వీడేవరకూ ఆ దేశంపై కఠినంగా వ్యవహరించాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో సింధూ నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన భారత్.. పాక్ జాతీయులకు అన్ని రకాల వీసా సేవలను వెంటనే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే జారీ చేసిన వీసాలు 2025 ఏప్రిల్ 27వ తేదీ వరకే చెల్లుబాటు అవుతాయి. మెడికల్ వీసాలు ఏప్రిల్ 29వరకే చెల్లుతాయని, గడువు ముగిసే వరకు భారత్ ను వీడాలని విదేశాంగశాఖ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పాకిస్థాన్ తో వాణిజ్య సంబంధాలను కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో పాకిస్థాన్ విలవిల్లాడుతోంది.

Online Medicines: మందులు హోమ్ డెలివరీ విధానంకు చెక్..! ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందా..? ఎందుకంటే..

భారతదేశం వాణిజ్య సంబంధాలను నిలిపివేయడంతో పాకిస్థాన్ లో ముందుల ఎమర్జెన్సీ ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన పాకిస్థాన్ ఆరోగ్య విభాగం అధికారులు ప్రత్యామ్నాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. పాకిస్థాన్ ఔషద ముడి పదార్థాల దిగుమతిలో 30 నుంచి 40శాతం వరకు భారతదేశంపైనే పాకిస్థాన్ ఆధారపడుతుంది. వీటిలో యాక్టీవ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (API), అధునాతన చికిత్సకోసం ఉపయోగించే ఔధాలకు సంబంధించిన ఉత్పత్తులు ఉన్నాయి.

Also Read: Pope Francis Funeral : వాటికన్ మాస్టర్ ప్లాన్.. పోప్ అంత్యక్రియల్లో మొదటి వరుసలోనే డోనాల్డ్ ట్రంప్.. మూడో వరుసలో ప్రిన్స్ విలియం!

భారత ప్రభుత్వం పాకిస్థాన్ తో వాణిజ్య సంబంధాలను నిలిపివేయడంతో పాక్ ఔషద రంగంపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. అధికారిక నోటిఫికేషన్ జారీ చేయనప్పటికీ.. ఇప్పటికే అత్యవసర ప్రణాళికలు అమలులో ఉన్నాయని డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ పాకిస్థాన్ (DRAP) ధృవీకరించింది. ‘‘2019 సంక్షోభం తరువాత మేము ఇటువంటి ఆకస్మిక పరిస్థితులకు సిద్ధం కావడం అలవాటుపడ్డాం. మా ఔషద అవసరాలను తీర్చడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ప్రస్తుతం చురుగ్గా పరిశీలిస్తున్నామని డీఆర్ఏపీ సీనియర్ అధికారి ఒకరు చెప్పినట్లు’’ జియో న్యూస్ తన నివేదికలో పేర్కొంది.

 

యాంటీ-రేబిస్ వ్యాక్సిన్‌లు, యాంటీ-స్నేక్ సీరం, క్యాన్సర్ చికిత్సలు, మోనోక్లోనల్ యాంటీబాడీలు మరియు ఇతర కీలకమైన జీవసంబంధమైన ఉత్పత్తులతో సహా అవసరమైన వైద్య సామాగ్రి నిరంతరం లభ్యతను నిర్ధారించడం డీఆర్ఏఫీ లక్ష్యం. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య వాణిజ్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోవటంతో ఔషదాల దిగుమతులకోసం చైనా, రష్యా, అనేక యూరోపియన్ దేశాలను కోరుతున్నట్లు డీఆర్ఏపీ అధికారులు తెలిపారు. ఔషధ దిగుమతుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులపై పాకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఇంకా అధికారిక ఆదేశాలు అందలేదు. అయితే, ఈ రంగంలో తీవ్రమైన ముందుల ఎమర్జెన్సీ ఏర్పడుతుందనే భయాలు పెరుగుతున్నాయి.

 

‘‘