పాక్ ప్రజల జీవితాల్ని మార్చేస్తున్న అభినందన్ ఫొటో

  • Publish Date - March 13, 2019 / 10:38 AM IST

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ ఫొటోను పెట్టుకొని పాక్ లో పలువురు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. పాక్ నిర్బంధంలో ఉన్న సమయంలో అభినందన్ చూపిన ధైర్యసాహసాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. పాక్ ప్రజలు కూడా అభినందన్ ధైర్యసాహసాలను కొనియాడుతున్నారు. ఈ క్రమంలో అభినందన్ ఫొటో అడ్డుపెట్టుకొని పలువురు తమ వ్యాపారాలను వృద్ధి చేసుకుంటున్నారు. ఇప్పటికే అభినందన్ ఫొటోను ను పాక్ చెందిన ఓ టీ కంపెనీ తన ప్రకటన కోసం వాడుకున్న విషయం తెలిసిందే. పాక్ కు చెందిన పలువురు తమ షాపుల దగ్గర ఇప్పుడు అభినందన్ ఫొటోను పెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటూ మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. 
Read Also : రూ.2వేల నోటు కోసం ప్రాణాలతో చెలగాటం

పాక్ లోని ఓ వ్యక్తి తన టీ షాపు దగ్గర అభినందన్ బ్యానర్ పెట్టుకొని ఓ సందేశం ఇస్తూ తన వ్యాపారాన్ని ప్రచారం చేసుకుంటున్నాడు. బ్యానర్ లో అభినందన్ ఫొటో పెట్టి దానిపై మిత్రులుగా మార్చే టీ ఇక్కడ దొరుకుతుంది అని రాసి ఉంది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై పలువురు నెటిజన్లు ఫన్నీగా సెటైర్లు వేస్తున్నారు. మీకు మా అభినందన్ మంచి జీవితం ఇచ్చాడు బాబాయ్ అని, అభినందన్ ఫొటో పాక్ ప్రజల జీవితాల్ని మార్చివేసిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.