రైల్లో మంటలు : 65కి పెరిగిన మృతుల సంఖ్య

పాకిస్తాన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. తేజ్ గామ్ ఎక్స్ ప్రెస్ లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 62మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.

  • Published By: veegamteam ,Published On : October 31, 2019 / 05:42 AM IST
రైల్లో మంటలు : 65కి పెరిగిన మృతుల సంఖ్య

Updated On : October 31, 2019 / 5:42 AM IST

పాకిస్తాన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. తేజ్ గామ్ ఎక్స్ ప్రెస్ లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 62మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.

పాకిస్తాన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. తేజ్ గామ్ ఎక్స్ ప్రెస్ లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 65మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. 30మంది తీవ్రంగా గాయపడ్డారు. రైలు కరాచీ నుంచి రావల్పిండి వెళ్తోంది. ప్రయాణికుడి దగ్గర ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో ప్రమాదం జరిగింది.

గురువారం(అక్టోబర్ 31,2019) ఉదయం ఈ ప్రమాదం సంభవించింది. తేజ్ గామ్ ఎక్స్ ప్రెస్ లాహోర్-కరాచీ మధ్య నడుస్తుంది. గ్యాస్ సిలెండర్ పేలడంతో మంటలంటుకున్నాయి. మూడు బోగీలు దగ్దమయ్యాయి. రహీమ్ యార్ ఖాన్ సమీపంలోని లియాఖత్‌పూర్ దగ్గర రైలు ప్రమాదానికి గురైంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది.

గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారీగా మంటలు వ్యాపించి బోగీలు కాలి బూడిదయ్యాయి. మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇతర బోగీలకు మంటలు వ్యాపించకుండా ఇంజిన్ నుంచి వేరు చేశారు. ఈ ఘటనపై పాకిస్తాన్ రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.