Pakistan vs Taliban
Pakistan vs Taliban : అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడులు తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని జరిగాయి. ప్రస్తుతం అప్ఘనిస్థాన్ తాలిబన్ల పాలనలో ఉంది. పాక్ తీరుపై తాలిబన్లు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తాజాగా.. పాక్ వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకున్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత పాకిస్థాన్ సరిహద్దుల్లో తాలిబన్ దళాలు దాడులకు దిగాయి. ఈ దాడుల్లో 12 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారు.
శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత పాకిస్థాన్ – అప్ఘనిస్తాన్ సరిహద్దుల్లో కాల్పులు జరిగాయి. తాలిబన్ నేతృత్వంలోని అప్ఘన్ దళాలు డ్యూరాండ్ లైన్ వెంబడి ఉన్న పక్టియా, దక్షిణ హెల్మండ్ వెంబడి ఉన్న అనేక పాకిస్థాన్ ఆర్మీ అవుట్ పోస్టులను ధ్వంసం చేశాయని అఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘‘ కునార్, హెల్మండ్ ప్రావిన్సుల్లో డ్యూరాండ్ లైన్ వెంబడి పాకిస్థాన్ సైన్యం నుండి తాలిబన్ దళాలు అనేక అవుట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయి’’ ప్రకటనలో తెలిపారు.
Also Read: US Tariffs : చైనాకు దిమ్మతిరిగే షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్.. మళ్లీ టారిఫ్ వార్ షురూ..
అర్థరాత్రి వేళ పాకిస్థాన్, అఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో 12మంది సైనికులు మరణించారు. అనేకమంది గాయపడ్డారని తెలుస్తోంది. బహ్రంచా జిల్లాలోని షకీజ్, బీబీజాని, సలేహాన్ ప్రాంతాల్లో.. అలాగే పక్తియాలోని ఆర్యుబ్ జాబీ జిల్లా అంతటా భారీ ఎత్తున తాలిబన్లు దాడులకు పాల్పడ్డారు.
అఫ్ఘనిస్తాన్ గగనతలంలోకి అక్రమంగా ప్రైవేశించి పాకిస్థాన్ వైమానిక దాడులకు తెగబడినందుకు ప్రతీకారంగా శనివారం అర్ధరాత్రి సమయంలో ఆపరేషన్‌ను చేపట్టామని అఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎనాయతుల్లా ఖోవరాజ్మి తెలిపారు. కొద్ది గంటల్లో తమ లక్ష్యాలను పూర్తి చేశామని అన్నారు.
అప్గానిస్తాన్ కాల్పులకు పూర్తిస్థాయిలో ప్రతిస్పందిస్తున్నట్టు పాకిస్తాన్ భద్రతా అధికారులు తెలిపారు. సరిహద్దు వెంబడి ఆరు కంటే ఎక్కువ ప్రాంతాల్లో రెండు వైపులా కాల్పులు జరిగాయని తెలిపారు. మూడు పాకిస్థాన్ సరిహద్దు పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్ దళాలు ప్రకటించగా.. తమ దళాలు అనేక అఫ్గాన్ అవుట్ పోస్టులను ధ్వంసం చేసినట్లు పాకిస్థాన్ ప్రకటించుకుంది.