అణ్వాయుధాల టీమ్ తో ఇమ్రాన్ ఎమర్జన్సీ మీటింగ్ 

  • Publish Date - February 27, 2019 / 06:44 AM IST

పాక్ పై భారత్ సర్జికల్ ఎటాక్స్ తరువాత పాక్ డిఫెన్స్ లో పడింది. ఈ క్రమంలో ఇస్లామాబాద్, రావల్సిండి సిటీలలో డిఫెన్స్ సైరన్ ను మోగిస్తు ప్రజలకు యుద్ధజరుగుతుందనే సందేశాలను ఇస్తోంది. దీనికి సంబంధించిన చర్యల్ని కూడా పాక్ తీసుకుంటోందని సమాచారం. ఈ క్రమంలో తాజాగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈరోజు (ఫిబ్రవరి 27) నేషనల్ కమాండ్ అథారిటీని అత్యవసర సమావేశానికి పిలిచారు.
Also Read: కాశ్మీర్ లో కూలిన యుద్ధ విమానం : ఇద్దరు పైలెట్లు మృతి

పాకిస్థాన్ అణ్వాయుధాలను ఈ కమాండ్ అథారిటీయే నిర్వహిస్తుంది. దీంతో భారత చేసిన సర్జికల్ దాడులతో తమకు ప్రాణనష్టం లేదని..ఈ దాడుల్లో వేసిన బాంబులన్నీ ఖాళీ ప్రదేశాలలోనే పడ్డాయని ప్రగల్భాలు పలికింది. ఈ దాడులకు  ఇండియాకు సర్ ప్రైజ్ ఇస్తామని కూడా మేకపోతు గాంభీర్యంతో హెచ్చరించింది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్యా యుద్ధ వాతావరణం ఏర్పంది. దీంతో పాక్ ప్రధాని నేడు అణ్వాయుధాల టీమ్ తో సమావేశం నిర్వహించడం గమనార్హం.

పాకిస్థాన్ అణు బాంబులతో దాడి చేస్తుందని భావించాల్సిన అవసరం లేదని మాజీ దౌత్యాధికారి కేసీ సింగ్ అభిప్రాయపడ్డారు. నేషనల్ కమాండ్ అథారిటీని సమావేశానికి పిలవడం కేవలం ఓ ఎత్తుగడ మాత్రమే కావచ్చని..తాము కూడా ఏదైనా చేయగలమన్న సంకేతాలు ఇచ్చేందుకే ఇమ్రాన్ ఈ సమావేశాన్ని నిర్వహించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.పాకిస్థాన్ ఒక్క బాంబు ఇండియాపై వేస్తే..20 బాంబులు వచ్చి పాక్ పై పడతాయని మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే.
Also Read: ఎంత బరితెగింపు : భారత్ లో బాంబులు వేసి వెళ్లిన పాక్ యుద్ధ విమానాలు