Pakistani Politicians: లైవ్ టీవీ షోలో పాక్ రాజకీయ నేతల ముష్టి యుద్ధం

పాకిస్థాన్ దేశంలో ఇద్దరు రాజకీయ నేతలు లైవ్ టీవీ షోలో కొట్టుకున్న వీడియో వైరల్ అయింది. ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య టీవీ లైవ్ షోలో జరిగిన వాగ్వాదం కాస్తా ముష్టి యుద్ధానికి దారితీసింది. దీంతో పాకిస్థాన్‌లో లైవ్ టీవీ రాజకీయ చర్చా కార్యక్రమం ఊహించని మలుపు తిరిగింది....

Pakistani Politicians : పాకిస్థాన్ దేశంలో ఇద్దరు రాజకీయ నేతలు లైవ్ టీవీ షోలో కొట్టుకున్న వీడియో వైరల్ అయింది. ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య టీవీ లైవ్ షోలో జరిగిన వాగ్వాదం కాస్తా ముష్టి యుద్ధానికి దారితీసింది. దీంతో పాకిస్థాన్‌లో లైవ్ టీవీ రాజకీయ చర్చా కార్యక్రమం ఊహించని మలుపు తిరిగింది. (Pakistani politicians brawl on live TV show) సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ సంఘటన జావేద్ చౌదరి హోస్ట్ చేసిన ప్రముఖ పాకిస్థానీ టాక్ షో కల్ తక్ లో జరిగింది.

Heavy Rains : నీటమునిగిన న్యూయార్క్ నగరం..ఎమర్జెన్సీ ప్రకటన

ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ కి అనుబంధంగా ఉన్న న్యాయవాది షేర్ అఫ్జల్ మార్వత్, నవాజ్ షరీఫ్ కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ సెనేటర్ అయిన అఫ్నాన్ ఉల్లాలు లైవ్ టీవీలో బాహాబాహీకి పాల్పడ్డారు. (live TV show amid heated debate) పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌పై సెనేటర్ అఫ్నాన్ ఉల్లా ఖాన్ ఆరోపణలు చేయడంతో మాటల వాగ్వాదం కాస్తా అదుపు తప్పి ముష్టి యుద్ధానికి దారి తీసింది.

Trains Collide : స్కాట్లాండ్‌లో రెండు రైళ్ల ఢీ…పలువురికి గాయాలు

ఈ ఆరోపణలకు ప్రతిస్పందనగా మార్వాట్ వాదనలతో ఎదురుదాడికి బదులుగా భౌతిక హింసను ఆశ్రయించాడు. దీంతో ఖాన్ తలపై కొట్టారు. ఖాన్ తిరగబడటంతో పరిస్థితి మరింత దిగజారింది. ప్రత్యక్షంగా టీవీ ప్రసారంలో ఇద్దరు నేతలు బాహాబాహీకి దిగారు. దీంతో షో సిబ్బంది, హోస్ట్ వారిద్దరిని వేరు చేయడానికి ప్రయత్నించినా గొడవ కొనసాగింది. ఈ ఘర్షణతో టీవీ వీక్షకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సంఘటన తర్వాత ఇద్దరు రాజకీయ నాయకులు తమ చర్యలను సమర్థించుకోవడానికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

Cricket World Cup : క్రికెట్ ప్రపంచకప్‌కు బెదిరింపులు…ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ పన్నూన్‌పై కేసు

పీటీఐ నాయకుడు ఇమ్రాన్ ఖాన్‌పై అఫ్నాన్ ఉల్లా ఉపయోగించిన అవమానకరమైన భాషను ఉటంకిస్తూ మార్వాట్ తన హింసాత్మక ప్రతిస్పందనను సమర్థించుకున్నాడు. సెనేటర్ అఫ్నాన్ ఉల్లా ఖాన్ అహింసపై తన నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. అయితే నవాజ్ షరీఫ్ సైనికుడిగా తన చర్యలను సమర్థించుకున్నాడు. ఈ సంఘటన ఆన్‌లైన్‌లో విస్తృత విమర్శలకు దారితీసింది. హింసను నిరోధించడంలో విఫలమైనందుకు కల్ తక్ హోస్ట్, సిబ్బందిని పలువురు తప్పు బట్టారు.