Pakistan : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాక్‌కు అవమానం .. అర్ధరాత్రి దాటినా కనిపించని పాక్ జెండా..

దుబాయ్ వేదికగా పాకిస్థానీయులకు ఘోర అవమానం జరిగింది. స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా మా బతుకులు ఇలా మారిపోయాయి అంటూ పాకిస్థానీయులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.స్వాతంత్ర్య వేడుకల్లో తమ జెండాను చూసుకోవటానికి వచ్చినా జాతీయ జెండాను కూడా చూసుకోలేకపోయామని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.

Pakistan flag Burj Khalifa Not Display

Pakistan : భారత్ స్వాత్రంత్ర్య దినోత్సవ సంబరాల్లో మునిగిపోయింది. భారతీయులంతా జాతీయ గీతాలాపనతో తరించిపోయారు. అదే సమయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాకిస్థాన్ కు దుబాయ్ వేదికగా ఘోర అవమానం జరిగింది. దీంతో దుబాయ్ లో ఉండే పాకిస్థానీయులు తమకు ఇది చాలా అవమానం అంటూ కృంగిపోయారు. అర్థరాత్రి దాటినా బుర్జ్ ఖలీఫాపై తమ జాతీయ జెండా మా బతుకులు ఇలా మారిపోయాయి అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.

అసలు విషయం ఏమిటంటే..భారత్ కు స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15 అనే విషయం తెలిసిందే. కానీ పాకిస్థాన్ కు స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 14 అనే విషయం కూడా తెలిసిందే. అఖండ భారతంగా ఉండే రెండు దేశాలు విడిపోయాయి అనే విషయం కూడా తెలిసిందే.

Britain : భారత్‌ను పాలించిన బ్రిటీష్ గడ్డపై భారత స్వాతంత్య్ర సంబరాలు .. మారు మోగిన ‘జనగణమన’

కాగా..స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే దేశాల జాతీయ జెండాలను బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి తమ జెండాను చూసుకునేందుకు పాక్ జాతీయులు పెద్ద ఎత్తున బుర్జ్ ఖలీఫా వద్దకు చేరుకున్నారు. కానీ అర్ధరాత్రి దాటినా కూడా తమ జెండా కనిపించకపోవడంతో వారు తీవ్ర నిరాశ చెందారు.

పాక్ స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఆ దేశ జాతీయ జెండా దుబాయ్‌లోని అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవంతిపై కనిపించకపోవడంతో దుబాయ్ లో ఉండే పాకిస్థానీయులు తీవ్ర నిరాశ చెందారు. ఎంతో ఆశగా తమ జెండాను చూడటానికి వచ్చినవారంతా నీరుకారిపోయారు. తీవ్ర నిరాశ చెందిన ఓ మహిళ మా బతుకులు ఇలా అయిపోయాయి అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. కానీ ఆ మరునాడే భారత స్వాతంత్ర్యం దినోత్సవం కాబట్టి భారత జాతీయ జెండా మాత్రం యథాతథంగా ప్రదర్శితమైంది బుర్జ్ ఖలీఫాపై.

ట్రెండింగ్ వార్తలు