Pandemic Is Returning' With Over 50,000 New Cases, Germany Hits Record In 24 Hours
Pandemic is Returning : జర్మనీలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కొత్త పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 50వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులు 50,196కు చేరగా.. వరుసగా నాల్గో రోజు పెరిగాయి. అక్టోబర్ మధ్య నుంచి కరోనా మరణాలు, కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. జర్మనీలో 50వేల కరోనా కేసులు దాటడం ఇదే తొలిసారి. దేశంలో కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌గా తేలిన కేసుల సంఖ్య 4.89 మిలియన్లకు చేరింది. కరోనా మరణాల సంఖ్య 97 వేలకు చేరినట్లు రాబర్ట్ కోచ్ ఇన్సిటిట్యూట్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
కరోనా ఇన్ఫెక్షన్లు నాటకీయమైన రీతిలో కరోనా కేసులు పెరుగుతున్నట్లు ఛాన్సలర్ ఏంజిలా మెర్కల్ అన్నారు. కరోనా ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించే ఆలోచనలేదని ప్రభుత్వం తెలిపింది. సాక్సోనీ, బవేరియా, బెర్లిన్ వంటి పలు రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
వ్యాక్సిన్ ఇప్పటికీ తీసుకోని వారికోసం కొత్త కరోనా ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు కరోనా టీకాలు వేయించుకోనివారిని బార్లు, రెస్టారెంట్లు, స్పోర్ట్స్ హాల్స్‌కు అనుమతించరాదని జర్మన్ ప్రభుత్వం ఆదేశించింది. జర్మనీలో కరోనా వ్యాక్సినేషన్ రేటు 67శాతం మాత్రమే నమోదు అయింది. కరోనా కేసుల పెరిగిపోతున్న నేపథ్యంలో అత్యవసరంగా ఆస్పత్రులను నిర్మించాల్సిన అవసరం ఉందంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.
Read Also :Woman Police Inspector: చెన్నై వరదల్లో మహిళా ఎస్సై.. స్పృహ కోల్పోయిన వ్యక్తిని భుజాలపై మోసుకెళ్తూ..