×
Ad

London-Kochi : విమానంలో మహిళకు పురిటి నొప్పులు, డెలివరీ ఎవరు చేశారంటే

ప్రసవవేదనతో ఆమె పడుతున్న బాధను చూసి విమానంలో ఉన్న వారు చలించిపోయారు. అదృష్టవశాత్తు విమానంలో వారు ఉండడం..ప్రసవం సుఖాంతం అవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

  • Published On : October 7, 2021 / 12:44 PM IST

Air India

Birth To Boy Mid-Air  : ఎయిర్ ఇండియా విమానంలో ఓ మహిళకు పురిటినొప్పులు రావడంతో అందరూ టెన్షన్ కు లోనయ్యారు. విమానం ఆకాశంలో ఉంది. ఎలా అని తెగ ఆలోచనలో పడిపోయారు విమాన సిబ్బంది. ప్రసవవేదనతో ఆమె పడుతున్న బాధను చూసి విమానంలో ఉన్న వారు చలించిపోయారు. అదృష్టవశాత్తు విమానంలో వారు ఉండడం..ప్రసవం సుఖాంతం అవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Read More : Samantha : పెళ్లి రోజూ భావోద్వేగమైన పోస్ట్ పెట్టిన సమంత..

ఈ ఘటన ఎయిరిండియా విమానంలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. ఎయిర్ ఇండియా విమానం…మంగళవారం లండన్ నుంచి కొచ్చిన్ బయలుదేరింది. 210 మంది విమానం ఎక్కారు. వీరిలో గర్భంతో ఉన్న మహిళ కూడా ఉన్నారు. విమానం ఆకాశంలోకి ఎగిరిన కొద్దిసేపటికి ఆ మహిళకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో విమాన సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఆ విమానంలో ఇద్దరు వైద్యులు, నలుగురు నర్సులు ఉన్నారనే సంగతి తెలిసింది.

Read More :  Drug Case : ఆర్యన్ ఖాన్ కు జైలా ? బెయిలా ?

దీంతో వారు ఆ మహిళకు డెలివరీ ఆపరేషన్ చేశారు. నెలలు నిండని ప్రసవాన్ని వారు చేశారు. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డకు వైద్యులు, చికిత్స అవసరం కావడంతో..మార్గమధ్యంలోని జర్మనీలోని ప్రాంక్ ఫర్ట్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అనంతరం తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించారు. అనంతరం భారత్ కు బయలుదేరింది.