Penguin walks up to an elderly woman
Penguin walks up to an elderly woman : పెంగ్విన్స్. భలే ముద్దుగా ఉంటాయి. బుడి బుడి నడకలతో భలే వింతగా ముద్దొస్తుంటాయి. పెంగ్విన్లు మనుషులంటే ఏమాత్రం భయపడవు సరికదా..మనుషులకు చేరువవుతాయి. చక్కటి స్నేహం కూడా చేస్తాయి. ఇదిలా ఉంటే ఓ బుజ్జి పెంగ్విన్ ఓ పెద్దావిడ వద్దకొచ్చింది. బామ్మా బామ్మా అని పిలుస్తునట్లే ఉంది దాని తీరు. అలా వచ్చిన పెంగ్విన్ తో పెద్దావిడ మాట్లాడే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పార్కింగ్ లాట్‌లో ఓ వృద్ధురాలు వద్దకు వచ్చిన పెంగ్విన్‌తో పెద్దావిడ మాటలు కలిపిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగవైరలవుతోంది.
గాబ్రియల్ కార్నో ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోకు లక్షలకొద్దీ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు వీరి ముచ్చట్లకు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోలో పార్కింగ్ లాట్‌లో వృద్ధురాలు మెల్లిగా నడుస్తుండగా ఆమె వద్దకు బుడి బుడి అడుగులు వేస్తూ ఓ పెంగ్విన్ వచ్చింది. అది తనకు దగ్గరకు రావటం చూసిన బామ్మ అలా చూస్తుండిపోయింది. అలా వచ్చిన పెంగ్విన్ బామ్మ పట్టుకుని ఉన్న గొడుగు వద్దకొచ్చింది. ఈ పెంగ్విన్ వంక ఆమె అలా చూస్తుండిపోయింది.
ఆ తరువాత పెంగ్విన్‌తో పెద్దావిడ ముచ్చటించడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. పార్కింగ్ లాట్‌లో మాటామంతీ అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. మహిళ ఫ్రెంచ్‌లో మాట్లాడగా ఓ యూజర్ అనువదించగా..ఆ పెంగ్విన్ తో ఆ పెద్దావిడ మాట్లాడుతూ నువ్వు చాలా బావున్నావ్..ఐ లవ్ యూ, ఇక్కడున్న వారందరిలో నువ్వు నాకు నచ్చావు..నువ్వు నా గొడుగు వంక అదేపనిగా చూస్తున్నావ్ గొడుగుతో నువ్వేం చేసుకుంటావు? నువ్వు రేపు కూడా ఇక్కడకు వస్తావా..మనం రేపు కలుసుకుందాం అంటూ వృద్ధురాలు పెంగ్విన్‌తో ముచ్చటించింది.
ఆ తరువాత ఆమె రెండు అడుగులు వేసి వెళ్లటానికి యత్నించినా ఆ పెంగ్విన్ మాత్రం ఆమెను వదల్లేదు. ఆమె కూడా అడుగులు వేసింది. మళ్లీ గొడువ వద్దకు వెళ్లి ముక్కుతో దాన్ని తాకింది. అది చూసిన ఆ పెద్దావిడ ఆగి మళ్లీ ఆ పెంగ్విన్ తో మాట్లాడింది. ఆమె మాట్లాడుతుంటూ అమాయకంగా ఆ పెంగ్విన్ తల విచిత్రంగా తిప్పుతూ ఆలకించిన తీరు హార్ట్ టచ్చింగ్ గా ఉంది.
ఈ వీడియోలో మహిళ పెంగ్విన్ తో ఆప్యాయంగా మెలిగిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఈ హార్ట్‌టచింగ్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండీ..
Exchange of views in a parking lot pic.twitter.com/JPWVDI7JC9
— Gabriele Corno (@Gabriele_Corno) December 12, 2022