ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నాయా? కరోనా కొత్త లక్షణం కావొచ్చు.. వైద్యుల హెచ్చరిక

  • Publish Date - August 8, 2020 / 04:17 PM IST

ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నాయా? కరోనా కొత్త లక్షణం కావొచ్చునని హెచ్చరిస్తున్నా వైద్యులు.. నాలుగు రోజుల పాటు అసాధారణ లక్షణాలు కనిపిస్తే అనుమానించాల్సిందేనని అంటున్నారు. నిరంతరాయంగా అదేపనిగా మీలో ఎక్కిళ్లు వస్తుంటే మాత్రం అప్రమత్తం కావాల్సిందే.. కరోనా ఇతర లక్షణాలు లేనప్పటికీ, చాలా రోజులు ఎక్కిళ్ళు వచ్చిన వ్యక్తిలో కరోనా వైరస్ పాజిటివ్ ఉంటేనే ఇలాంటి లక్షణం బయటకు కనిపిస్తుందని సూచిస్తున్నారు.

చికాగోకు చెందిన 62 ఏళ్ల రోగిని ఏప్రిల్‌లో ఆసుపత్రిలో చేర్పించారు. ఒక్కసారిగా అతడు బరువు తగ్గడం మొదలైందని వైద్యులు గుర్తించారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్‌లో దీనికి సంబంధించి నివేదికను ప్రచురించారు. అతడికి డయాబెటిస్ ఉంది, కానీ జ్వరం లేదా గొంతు నొప్పి లక్షణాలు కనిపించలేదు.



కానీ అతను నాలుగు రోజులుగా నిరంతరయంగా ఎక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి. కరోనావైరస్ టెస్టు చేయించకోగానే అతడికి పాజిటివ్ అని తేలింది. ఎక్కిళ్ళు రావడం అసాధారణమైన చర్యగా పేర్కొన్నారు. మనం తినే కొన్ని ఆహారాలు, ఉత్సాహం లేదా ఒత్తిడి వంటి బలమైన భావోద్వేగాల సమయంలో ఇలాంటి ఎక్కిళ్లు వస్తుంటాయి.

ప్రస్తుతం కరోనావైరస్ కొత్త లక్షణాలు బయట పడుతున్నాయి. నిరంతర దగ్గు, అధిక ఉష్ణోగ్రత లేదా రుచి లేదా వాసన కోల్పోవడం వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. చికాగో కేసులో, బాధితుడు అత్యవసర విభాగానికి వచ్చినప్పుడు అతని ఉష్ణోగ్రత 37.3C, అతని గుండె స్పందన నిమిషానికి 96 సార్లు కొట్టుకుంటోంది.



వైద్యులు అప్పుడు ఊపిరితిత్తులపై స్కాన్ చేసి అసలు విషయాన్ని కనుగొన్నారు, ఒక వ్యక్తి ఊపిరితిత్తుల సామర్థ్యంపై ప్రభావం చూపినట్టు సూచిస్తోంది. తదుపరి స్కాన్లలో ఊపిరితిత్తుల ద్వారా చెల్లాచెదురుగా ఉన్నట్లు గుర్తించారు. రోగిని ఒక ఐసోలేషన్ చేర్చారు. అతడికి న్యుమోనియా చికిత్స అందించారు. అనంతరం అతడ్ని కోవిడ్ సెంటర్ కు తరలించారు. కోవిడ్ యూనిట్‌కు చేరుకున్న సమయంలో అతని ఉష్ణోగ్రత మళ్లీ 38.4C చేరింది. రోగి హృదయ స్పందన కూడా నిమిషానికి 104 వరకు కొట్టుకుంది.



వైద్యులు అతన్ని గాలి తగిలే ప్రదేశంలో ఒంటరిగా ఉంచారు. మలేరియా నిరోధక ఔషధ హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో కూడా పరీక్షించారు. మే నెలలో NHS ఇంగ్లాండ్ అధికారిక లక్షణాల జాబితాలో రుచి, వాసనను కోల్పోవడం, తలనొప్పి వంటి పరిస్థితులను అధికారిక జాబితాలో చేర్చాలని సూచించింది. కోవిడ్ నుండి కోలుకున్న ఇతర వ్యక్తులు కూడా వారి జుట్టు రాలిపోతుందని చెప్పారు. 62 ఏళ్ల వ్యక్తిలో కోవిడ్ -19 వ్యాప్తితో నిరంతర ఎక్కిళ్ళు రావడం ఇదే మొదటి కేసుగా పేర్కొన్నారు.