Bill Gates Daughter : బిల్‌గేట్స్ కుమార్తెకు 20ఏళ్లు జైలు శిక్ష తప్పదా? ఏం జరిగింది? అసలు ‘కుకీ స్టఫింగ్’ అంటే ఏమిటి?

Bill Gates Daughter : మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కుమార్తె ఫోబ్ గేట్స్‌ ఆన్‌లైన్ అక్రమాల కేసులో చిక్కుకున్నారు.

Bill Gates Daughter Phoebe Gates

Bill Gates Daughter : మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కుమార్తె ఫోబ్ గేట్స్‌ ఆన్‌లైన్ అక్రమాల కేసులో చిక్కుకున్నారు. ఆమె స్నేహితురాలు సోఫియాతో కలిసి స్థాపించిన ‘ఫియా’ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ కుకీ స్టఫింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో నేరం రుజువైతే.. అమెరికా చట్టాల ప్రకారం.. ఫోబ్ గేట్స్‌కు సుమారు 20ఏళ్లు జైలు శిక్షపడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Suryapet : సూర్యాపేట భార్యాభర్తల హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఇద్దరు కానిస్టేబుళ్లు.. అసలు విషయం ఇదే..

‘కుకీ స్టఫింగ్’ అంటే ఏమిటి?
ఫోబ్ గేట్స్ తన స్నేహితురాలితో ప్రారంభించిన ఫియా స్టార్టప్ డిజిటల్ పర్సనల్ షాపింగ్ అసిస్టెంట్. ఇది ఏఐతో నడిచే టూల్. మన అవసరాలు, ప్రాధాన్యతలకు తగిన ఉత్పత్తులను గుర్తించడంలో సహకరిస్తుంది. అంటే.. ఆన్‌లైన్ రిటైలర్ల వివరాలను పరిశీలించి డిస్కౌంట్ కోడ్‌లను వెతికి ఒక బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌గా పనిచేస్తుంది. పేమెంట్ సమయంలో కూపర్ కోడ్‌లలో ఒకదాన్ని ఎంచుకుంటే.. ఫియా స్టాఫ్‌వేర్ దానికి ఒక ఉత్పత్తిని జత చేస్తుంది. అది ఒక ట్రాకింగ్ ఫైల్ తరహాలో పనిచేస్తుంది. దీంతో యూజర్ ఒక ఉత్పత్తిని కొనుగోలు చేయడంలో ఫియా సహకారం ఉందని రిటైలర్‌కు సంకేతం వెళ్తుంది. అప్పుడు కొంత మొత్తం కమిషన్ లభిస్తుంది. అయితే, కొనుగోలు ఎంపికలో తమ పాత్ర లేనప్పటికీ కొన్ని కంపెనీలు ఇలా ట్రాకింగ్ ఫైల్‌ను జత చేస్తున్నాయి. దీన్నే కుకీ స్టఫింగ్ అంటారు. ఇప్పుడు ఫియా సంస్థ ఈ కుకీ స్టఫింగ్ ఆరోపణలు ఎదుర్కొంటుంది.

ఫోబ్ గేట్స్‌కు జైలు శిక్ష పడుతుందా?
ఈ వివాదంలో 20 ఏళ్ల వరకు జైలు శిక్ష అనే అంశం చర్చకు వచ్చింది. అయితే అది ‘కుకీ స్టఫింగ్’కు ప్రత్యేకంగా నిర్ణయించిన శిక్ష కాదు. అమెరికాలో మోసం చేసి డబ్బు లేదంటే ఆస్తిని పొందేందుకు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లను ఉపయోగించిన కేసుల్లో వర్తించే ఫెడరల్ వైర్ ఫ్రాడ్ చట్టం కింద గరిష్ఠంగా 20 ఏళ్ల శిక్ష ఉండొచ్చని న్యాయ విశ్లేషణలు చెబుతున్నాయి. అయితే, గరిష్ఠ శిక్ష 20ఏళ్లు ఉందని మాత్రమే.. ఖచ్చితంగా ఆ స్థాయిలో శిక్ష పడుతుందని అర్ధం కాదు.

ఫియా సంస్థ వివరణ..
కుకీ స్టఫింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఫియా సంస్థ వివరణ ఇచ్చింది. సాంకేతిక సమస్యతో ఇలా జరిగిందని, దాన్ని నెల క్రితమే గుర్తించామని పేర్కొంది. దీని ద్వారా అందిన నిధులను వెనక్కి ఇచ్చే ప్రక్రియ ప్రారంభించామని తెలిపింది. కుకీ స్టఫింగ్ సమయంలో.. దానిని గుర్తించిన తరువాత సంస్థ ఆదాయంలో భారీ తేడాలు వచ్చాయి. అయితే, ఇంతకుముందు సంస్థకు రోజువారీ ఆదాయం 77లక్షలు (80వేల డాలర్లు)గా ఉండగా.. కుకీ స్టిఫింగ్ నిలిచిపోయాక అది సగటున రూ.14లక్షలకు (15వేల డాలర్లు) పడిపోయింది. దీంతో ఫోబీ గేట్స్ కు చట్టపరమైన చిక్కులు తప్పని పరిస్థితి ఏర్పడింది.

జైలు కంటే ఆర్థిక నష్టం, సివిల్ కేసులే ఎక్కువ అవకాశం?
న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆరోపణలు రుజువైతే సంబంధిత కంపెనీలు లేదా వ్యాపార భాగస్వాములు నష్టపరిహారం, కమీషన్లకు సంబంధించిన మొత్తాల చెల్లింపు వంటి సివిల్ చర్యలను కోరే అవకాశం ఉంది. సంస్థకు సంబంధించిన అఫిలియేట్ నెట్‌వర్క్‌లతో సమస్యలు తలెత్తడంతో పాటు, తప్పుగా ఆపాదించిన లావాదేవీలను సరిచేసే ప్రక్రియ కూడా కొనసాగుతోంది.