మన భూభాగంలోకి చొరబడ్డ పాకిస్తాన్ విమానాలను తరుముతూ.. భారత వైమానిక దళానికి చెందిన విమానాలు పాక్ భూభాగంలోకి వెళ్లడం, వాటిని పాక్ ఆర్మీ కూల్చివేయడం తెలిసిందే. భారత్ విమానాలను కూల్చేసిన పాక్.. వాటికి సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది. పైలెట్ల దగ్గర, విమానాల్లో ఉన్న వస్తువులకు సంబంధించిన లిస్ట్, ఫొటోలు పాక్ ఆర్మీ విడుదల చేసింది.
Also Read: కాశ్మీర్ లో కూలిన యుద్ధ విమానం : ఇద్దరు పైలెట్లు మృతి
కూలిన భారత యుద్ధ విమానాలు ఇలా ఉన్నాయి అంటూ కథనం ప్రచురించింది పాక్ మీడియా. భారత యుద్ధ విమానాలు దురాక్రమణకు పాల్పడ్డాయని, సరిహద్దులు దాటి మా భూభాగంలోకి చొరబడ్డాయని, అందుకే దాడి చేసి కూల్చేశామని పాక్ ఆర్మీ ఆరోపించింది.
పాక్ యుద్ధ విమానాలు జరిపిన దాడిలో భారత యుద్ధ విమానాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఓ ప్రాంతంలో ఇంజిన్ పడితే.. మరో ప్రాంతంలో మిగతా విమాన శకలాలు పడ్డాయి. భారత వింగ్ కమాండర్ విక్రమ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పాక్ ఆర్మీ ప్రకటించింది. దానికి సంబంధించిన ఫొటోలను రిలీజ్ చేసింది.
Also Read:పాక్ ను తక్కువ అంచనా వేయొద్దు : ప్రతిచర్య చూపించామన్న ఇమ్రాన్ ఖాన్
2019, ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల 40 నిమిషాల సమయంలో ఈ ఫొటోలు తీసినట్లు ప్రకటించారు. ప్రమాదం అంతకు ముందే జరిగినట్లు పాక్ పత్రిక వెల్లడించింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కొన్ని వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు పాక్ అధికారులు. వాటిలో పైలట్ విక్రమ్ అభినందన్ కు చెందిన రూట్ మ్యాప్‌లు ఉన్నాయి. ఓ తుపాకీ కూడా ఉంది. వాటన్నింటినీ డిస్ ప్లే చేసి మరీ చూపించింది పాక్ ఆర్మీ.