Pig Heart Transplant : పంది గుండె అమర్చిన రోగి మృతి.. ఆరు నెలల తర్వాత ఆర్గాన్ రిజెక్షన్

తొలి నెల రోజులు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నా, ఆ తర్వాత ఆర్గాన్ రిజెక్షన్ కు గురైందని మేరీల్యాండ్ వైద్యులు ప్రకటించారు.

Pig Heart Transplant Patient Died

Pig Heart Transplant Patient Died : అమెరికాలో పంది గుండె అమర్చిన రోగి మృతి చెందారు. గుండె ఫెయిల్యూర్ కు చికిత్సగా జన్యుపరంగా మార్పిడి చేసిన పంది గుండెను అమర్చిన రోగి మరణించారు. అమెరికన్ లారెన్స్ ఫాసెట్టి(58) గుండె ఫెయిల్ కావడంతో సెప్టెంబర్ 20న యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ వైద్యులు ఆయనకు గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేశారు.

తొలి నెల రోజులు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నా, ఆ తర్వాత ఆర్గాన్ రిజెక్షన్ కు గురైందని మేరీల్యాండ్ వైద్యులు ప్రకటించారు. ఆరు నెలల తర్వాత ఆయన మృతి చెందారని పేర్కొన్నారు. పంది గుండెను అమర్చిన తర్వాత ఫాసెట్టి వేగంగా కోలుకున్నారు.

Pig Heart Transplant : పందిగుండె మార్పిడి తర్వాత మరణించిన వ్యక్తిలో జంతు సంబంధిత వైరస్ గుర్తించిన నిపుణులు

ప్రపంచంలో ఈ తరహా గుండె మార్పిడి ఆపరేషన్ చేసుకున్న రెండో వ్యక్తిగా ఆయన వార్తల్లో నిలిచారు. కానీ, పంది గుండె అమర్చిన 6 నెలల తర్వాత దురదృష్టవశాత్తు ఫాసెట్టి మరణించారు.