US Navy Fighter Jet Crash
US Navy Fighter Jet Crashes : శాన్ డియాగోలో యూఎస్ నేవీ ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో యూఎస్ మెరైన్ కార్ప్స్ ఎఫ్/ఎ-18 హార్నెట్ ఫైటర్ జెట్ పైలట్ మరణించినట్లు నార్త్ కరోలినాలోని 2వ మెరైన్ ఎయిర్‌క్రాఫ్ట్ వింగ్, మెరైన్ కార్ప్స్ ఎయిర్ స్టేషన్ చెర్రీ పాయింట్ ఒక ప్రకటనలో తెలిపింది. (US Navy Fighter Jet Crashes) ఈ ఫైటర్ జెట్ విమానంలో ఒక్క పైలట్ మాత్రమే ఉన్నారని మెరైన్ ఎయిర్‌క్రాఫ్ట్ వింగ్ పేర్కొంది. (Pilot Dead)
Madagascar : మడగాస్కర్‌లోని స్టేడియం తొక్కిసలాటలో 12 మంది మృతి, 80 మందికి పైగా గాయాలు
క్రాష్ సైట్ మెరైన్ కార్ప్స్ ఎయిర్ స్టేషన్ మిరామార్ సమీపంలో ఉంది. ఈ విమాన ప్రమాదం తర్వాత పైలట్ మరణించినట్లు రెస్క్యూ టీం నిర్ధారించింది. (San Diego) మరణించిన పైలట్ కుటుంబానికి మెరైన్ ఎయిర్‌క్రాఫ్ట్ వింగ్ సంతాపం తెలిపింది. అమెరికా దేశంలోని మొట్టమొదటి ఆల్ వెదర్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలిన ఘటనలో భూమిపై ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఈ ఫైటర్ జెట్ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు.