Plane
Plane Crash At Juba Airport దక్షిణ సుడాన్ లో కార్గో విమానం కూలిపోయింది. మంగళవారం ఉదయం జుబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మబాన్ కి బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే 10:36గంటల సమయంలో కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో విమానంలో ఉన్న పైలెట్‌తో పాటు ఐదుగురు మరణించారు.
మరణించినవారిలో ఇద్దరు రష్యాకు చెందిన వారు కాగా.. మిగతావాళ్లు దక్షిణ సుడాన్‌కు చెందిన వారు. విమానం ప్రమాదానికి గురైనప్పుడు అందులో ఇంధనం కూడా ఉన్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. కాగా, కూలిన విమానం ఆప్టిమమ్ ఏవియేషన్ లిమిటెడ్‌కు చెందినదిగా గుర్తించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.
అయితే తాజా ప్రమాదంతో 2011లో దక్షిణ సూడాన్ స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి విమాన ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 87కి చేరుకుంది.