Korean Air lines: హమ్మయ్య బతికిపోయాం.. ల్యాండ్‌ అవుతుండగా రన్‌వే పైనుంచి దూసుకెళ్లిన కొరియన్‌ విమానం

ఫిలిప్పీన్స్ విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం తప్పింది. 173 మంది ప్రయాణికులతో వెళ్తున్న కొరియన్ ఎయిర్‌లైన్స్ కో విమానం సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ల్యాండింగ్ సమయంలో రన్‌వేపైకి దూసుకెళ్లింది.

Korean Airlines

Korean Air lines: ఫిలిప్పీన్స్ విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం తప్పింది. 173 మంది ప్రయాణికులతో వెళ్తున్న కొరియన్ ఎయిర్‌లైన్స్ కో విమానం సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ల్యాండింగ్ సమయంలో రన్‌వేపైకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో విమానం ముందుభాగం భారీగా దెబ్బతింది. ఆదివారం అర్థరాత్రి తరువాత ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. రన్‌వే పై లాండ్ అవుతున్న  క్రమంలో విమానాశ్రయంలోని గడ్డిలోకి దూసుకుంది.

Korean Airlines

ఈ ప్రమాదం కారణంగా డజన్ల కొద్దీ విమానాలు విమానాశ్రయానికి రాకుండా రద్దు చేయబడ్డాయి. విమానం ముందు భాగంలోని అండర్‌బెల్లీ తెగిపోయి దాని ముక్కు బాగా పూర్తిగా దెబ్బతింది. 11 మంది సిబ్బంది, 162 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే, వారు తప్పించుకోవడానికి అత్యవసర స్లైడ్‌లను ఉపయోగించాల్సి వచ్చింది.

Korean Airlines

కొరియన్ ఎయిర్ లైన్స్ కంపెనీ ప్రకటన ప్రకారం.. దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నుండి వెళ్తున్న ఎయిర్‌బస్ A330 మూడవ ప్రయత్నంలో రన్‌వేను అధిగమించడానికి ముందు రెండుసార్లు ల్యాండ్ కావడానికి ప్రయత్నించింది. సాధ్యంకాకపోవటంతో మూడోసారి ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగినవెంటనే స్థానిక ఎమర్జెన్సీ సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లి ప్రయాణికులందరిని విమానం ఎస్కేప్ స్లైడ్‌ల ద్వారా బయటకు దింపారు.