Modi conferred with France award
PM Modi : ఫ్రాన్స్ దేశంలో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆ దేశాధ్యక్షుడు మాక్రాన్ ఫ్రాన్స్ అత్యున్నత గౌరవ పురస్కారాన్ని ప్రదానం చేశారు. శుక్రవారం జరిగే ఫ్రెంచ్ జాతీయ దినోత్సవ వేడుకల్లో మాక్రాన్‌తో ప్రధాన అతిథిగా మోదీ పాల్గొననున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్‌ను (Grand Cross of the Legion of Honour) ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రదానం చేసినట్లు ఆ దేశ అధికారిక ప్రకటన తెలిపింది. (PM Modi conferred with France highest award)
Seema Haider : సీమాహైదర్ ప్రేమ కథలో ముంబయి పోలీసులకు మరో హెచ్చరిక
గురువారం రాత్రి డిన్నరుకు ముందు నరేంద్ర మోదీకి ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం పారిస్ చేరుకున్న మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. శుక్రవారం జరిగే ఫ్రెంచ్ జాతీయ దినోత్సవ వేడుకల్లో మాక్రాన్‌తో కలిసి గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. ‘‘ఫ్రాన్స్‌లో అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ లెజియన్ ఆఫ్ హానర్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందించారు’’ అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ చెప్పారు.
PM Modi Big Announcements : వర్క్ వీసాలు, కొత్త కాన్సులేట్…ఫ్రాన్సులో మోదీ ప్రకటన
భారత ప్రజల తరపున ఈ ఏకైక గౌరవానికి ప్రెసిడెంట్ మాక్రాన్‌కు ధన్యవాదాలని భారత విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు ఫ్రాన్స్ అధ్యక్షురాలు, ప్రథమ మహిళ బ్రిగిట్టే మాక్రాన్ ఎలీసీ ప్యాలెస్‌లో మోదీకి ప్రైవేట్ విందు ఇచ్చారు. ఫ్రాన్స్ తన జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటోందని, అందులో తాను గౌరవ అతిథిగా హాజరవుతున్నానని మోదీ పేర్కొన్నారు.
PM Modi in Paris : ఫ్రాన్సులో మిన్నంటిన భారత్ మాతాకీ జై నినాదాలు
తాను చాలాసార్లు ఫ్రాన్స్ దేశానికి వచ్చానని, అయితే ఇది ఈసారి ప్రత్యేకమైనదని, భారతదేశం, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాల బలాన్ని మోదీ కొనియాడారు. భారతదేశం-ఫ్రాన్స్ భాగస్వామ్యానికి ప్రజల మధ్య అనుసంధానం కీలక పునాదిగా అభివర్ణించారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని డయాస్పోరా సభ్యులను మోదీ కోరారు.