Site icon 10TV Telugu

PM Modi: ట్రంప్ టారిఫ్ బాంబ్.. తగ్గేదేలే అంటున్న మోదీ.. రష్యాతో దోస్తీ మరింత బలోపేతం..

Russian President Putin lauds India again

PM Modi: ట్రంప్ టారిఫ్ బెదిరింపులకు భారత్ బెదరడం లేదు. ట్రంప్ దుందుడుకు చర్యలను ఎండగట్టేందుకు మోదీ ప్రత్యేక వ్యూహం రచిస్తున్నారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేస్తోందన్న ఉద్దేశంతో భారత్ పై ట్రంప్ 50శాతం సుంకాలు విధించినా.. ఇండియా మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. 23వ భారత్, రష్యా వార్షిక సదస్సుకు రావాలని పుతిన్ ను ఆహ్వానించారు. ఒకవైపు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్నందుకు ట్రంప్ టారిఫ్ విధించినా భారత్ మాత్రం రష్యాతో దోస్తీని బలోపేతం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఆయన భేటీ అయ్యారు. ట్రంప్ సుంకాలపై పుతిన్ తో అజిత్ ధోవల్ చర్చించారు. ఈ సందర్భంగా మోదీ పుతిన్ కు కాల్ చేశారు. భారత్ రావాలని కోరారు. ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడిన పుతిన్.. యుక్రెయిన్ తో చేస్తున్న యుద్ధంపై మోదీకి వివరించారు.

యుద్థం తాజా పరిణామాలపై చర్చించారు. అయితే భారత్ మాత్రం ఎప్పుడూ శాంతి వైపే ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. వివాదాన్ని శాంతియుతంగా చర్చించుకోవాలని మోదీ సూచించారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని మోదీ నిర్ణయించారు.

Also Read: విదేశీ విద్యార్థులపై ట్రంప్ కఠిన నిబంధనలు, చర్యలు.. దీంతో ఇప్పుడు ఏం జరుగుతోందంటే?

Exit mobile version