Imran Khan: ఇమ్రాన్ అవుట్ తర్వాత పీఎం అభ్యర్థిగా నామినేట్ అయిన షెబాజ్ షరీఫ్

ప్రతిపక్ష పార్టీలు పీఎంఎల్-ఎన్ ప్రెసిడెంట్ షెబాజ్ షరీఫ్ ను ప్రధాని అభ్యర్థిగా నామినేట్ చేశాయి. మూడు సార్లు ప్రధానిగా వ్యవహరించిన నవాజ్ షరీఫ్ తమ్ముడైన షెబాజ్.. భవితవ్యం సోమవారంతో..

Imran Khan (1)

Imran Khan: ప్రతిపక్ష పార్టీలు పీఎంఎల్-ఎన్ ప్రెసిడెంట్ షెబాజ్ షరీఫ్ ను ప్రధాని అభ్యర్థిగా నామినేట్ చేశాయి. మూడు సార్లు ప్రధానిగా వ్యవహరించిన నవాజ్ షరీఫ్ తమ్ముడైన షెబాజ్.. భవితవ్యం సోమవారంతో తేలనుంది. ఈ నామినేషన్ పట్ల షెబాజ్ షరీఫ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

‘అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. మీడియా, పౌర సమాజం, న్యాయవాదులు, నవాజ్ షరీఫ్, ఆసిఫ్ జర్దారీ, మౌలానా ఫజల్-ఉర్-రెహ్మాన్, బిలావల్ భుట్టో, ఖలీద్ మక్బూల్, ఖలీద్ మాగ్సీ, మోసిన్ దావర్, అలీ వజీర్, అమీర్ హైదర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు. రాజ్యాంగం కోసం నిలబడినందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు” అని ట్వీట్ చేశారు.

ఇమ్రాన్ ఖాన్ పార్లమెంట్‌లో ట్రస్ట్ ఓటింగ్‌లో ఓడిపోవడంతో పాకిస్తాన్ ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ పద్ధతిలో తొలగించబడిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ నిలిచారు. అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన తర్వాత, తొలగించబడిన ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మొదటిసారి అంటే ఆదివారం ఇలా ట్వీట్ చేశారు, “1947లో పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించింది. కానీ పాలన మార్పు, విదేశీ కుట్రకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటం ఈ రోజు నుంచి మళ్లీ ప్రారంభమవ్వాల్సిందే. దేశ ప్రజలే ఎల్లప్పుడూ తమ సార్వభౌమత్వాన్ని & ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు’ అని ట్వీట్ లో పేర్కొన్నారు.

Read Also : ఇమ్రాన్ ఖాన్ భావోద్వేగ ప్రసంగం.. భారత్‌‌ను ఏ సూపర్ పవర్ శాసించలేదు