Polish politician blames low birthrate on young women drinking
Poland Jarosław Kaczyński : అమ్మాయిలు మద్యానికి బానిసలు అవుతున్నారని..వారు అతిగా మద్యం తాగటం వల్లే దేశంలో జననాల రేటు తక్కువగా ఉందని పోలండ్ అధికార పార్టీ కీలక నేత జరోస్లా కజిన్ స్కీ వ్యాఖ్యానించారు. శనివారం (నవంబర్ 5,2022) కజిన్ స్కీ ఓ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో జనాభా సంక్షోభం కలగటానికి కారణం యువతులు అతిగా మద్యం తాగటమేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పలువురు రాజకీయ నేతలు, సెలబ్రిటీలు మహిళలు,యువతుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. కిజన్ స్కీ చేసిన ఈ వ్యాఖ్యలు పితృస్వామ్యానికి నిదర్శనంగా ఉన్నాయని దుయ్యబడుతున్నారు. 73 ఏళ్ల వయస్సులో కజిన్ స్కీ ఇటువంటి అర్థం పర్థంలేని వ్యాఖ్యలు చేయటం ఆయనకు సరికాదంటున్నారు.
యువతులు అతిగా మద్యం తాగే వ్యాఖ్యలపై ఆయన మాట్లాడుతూ..25 ఏళ్ల వయసు వచ్చే వరకు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో గమనిస్తే.. యువ మహిళలు తమ వయసు వారైన పురుషులతో సమానంగా మద్యాన్ని సేవిస్తున్నారు. అందుకే పిల్లలు పుట్టటం లేదు అని కజిన్ స్కీ వ్యాఖ్యానించారు. పురుషుడు మద్యానికి బానిసగా మారాలంటే అధికంగా 20 ఏళ్ల పాటు సేవించాల్సి ఉంటే.. మహిళలకు కేవలం రెండేళ్లు చాలని అన్నారు. తన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నా కజిన్ స్కీ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. నేను నా వ్యక్తిగతంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని..ఓ సీనియర్ డాక్టర్ తన ఎక్స్ పీరియన్స్ ఆధారంగా చెబుతున్నవి అని తెలిపారు.
ఓ డాక్టర్ తన ఆల్కహాల్ బాధిత రోగుల్లో (మగవారు) మూడింట ఒక వంతు మందిని సరిదిద్దగా.. మహిళల్లో ఒక్కరినీ బాగుచేయలేకపోయానని సదరు డాక్టర్ తనకు చెప్పారని వివరించారు. ఒక స్త్రీ తల్లిగా పరిపక్వం చెందాలని సూచించిన ఆయన చిన్న వయస్సులోనే స్త్రీలు పిల్లలను కనడానికి తాను అనుకూలంగా లేరని అన్నారు.
స్కీ చేసిన ఈ వ్యాఖ్యలు ఓ చెత్తవి అంటూ కొట్టిపారేశారు వామపక్ష మహిళా నేత జోవన్నా. పితృస్వామ్య భావజాలానికి స్కీ వ్యాఖ్యలు నిదర్శనంగా ఉన్నాయని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై మీమర్స్ తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చు అంటూ ఎద్దేవా చేశారు. అలాగే స్కీ వ్యాఖ్యలపై మరో నేత మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని అన్నారు.
ఫుట్‌బాల్ స్టార్ రాబర్ట్ లెవాండోవ్స్కీ భార్య అన్నా సోషల్ మీడియా వేదికగా..ఇక ఇటువంటి వ్యాఖ్యల్ని కట్టిపెట్టండీ.. రాజకీయనాయకులు దేశంలో ఉండే సమస్యలపై దృష్టి పెట్టండీ..సమస్యలను గుర్తించకుండా మహిళలపై ఇటువంటి వ్యాఖ్యలు చేయటం సరికాదంటూ మండిపడ్డారు. మహిళలపై ఇటువంటి అన్యాయపు విమర్శలు చేయటం మాని సమస్యల్ని పరిష్కరించండీ అంటూ ఏకిపారేశారు. కాగా..పోలండ్ లో ఓ మహిళ సగటు జనన రేటు 1.3 కు తగ్గిపోవడం అక్కడ ఆందోళన కలిగిస్తోంది. ఈక్రమంలో అధికార పార్టీ కీలక నేత జరోస్లా కజిన్ స్కీ ఈ వ్యాఖ్యలు చేయటం తీవ్ర విమర్శలకు దారితీసింది.