Post Covid : పోస్ట్ కొవిడ్ తో బాధపడుతున్నవారికి గుడ్ న్యూస్.. ఆక్సిజన్ థెరపీతో ఉపశమనం

కొవిడ్ అనంతర లక్షణాలతో గుండె పనితీరు మందగించి ఇబ్బందిపడుతున్న వారికి ఈ చికిత్స ద్వారా మేలు జరుగుతుందని డాక్టర్లు తెలిపారు. ఇజ్రాయెల్ లోని సాక్లర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పరిశోధకుడు మారినా లెట్ మన్ ఆధ్వర్యంలో అధ్యయనం నిర్వహించారు.

Oxygen Therapy

Post Covid Oxygen Therapy : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. కరోనా బారినపడి కోట్లాది మంది ప్రజలు మరణించారు. వైరస్ బారిన పడి కోలుకున్నవారు పోస్ట్ కొవిడ్ తో బాధపడుతున్నారు. పోస్ట్ కొవిడ్ తో బాధపడుతున్న వారికి డాక్టర్లు గుడ్ న్యూస్ అందింది. ఆక్సిజన్ థెరపీతో పోస్ట్ కోవిడ్ తో బాధపడుతున్న వారికి ఉపశమనం లభించనుంది.

కొవిడ్ అనంతర లక్షణాలతో గుండె పనితీరు మందగించి ఇబ్బందిపడుతున్న వారికి ఈ చికిత్స ద్వారా మేలు జరుగుతుందని డాక్టర్లు తెలిపారు. ఇజ్రాయెల్ లోని సాక్లర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పరిశోధకుడు మారినా లెట్ మన్ ఆధ్వర్యంలో అధ్యయనం నిర్వహించారు.

Corona Heart Attack : కరోనా సోకిన వారికి గుండెపోటుతోపాటు అనేక రోగాలు!

పోస్ట్ కొవిడ్ తో కొందరు ఇబ్బంది పడుతున్నారు. కొవిడ్ అనంతరం కొంతమందిలో గుండె పనితీరు మందగిస్తోంది. వాంతులు, వికారం, తలనొప్పి, శ్వాస నెమ్మదించడం, ఆందోళన, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ సమస్యనే పోస్ట్ కొవిడ్ అని అంటారు.

పోస్ట్ కొవిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న 60 మందికి హైపర్ బారిక్ స్వచ్ఛమైన ఆక్సిజన్ ను అందించారు. ఎనిమిది వారాల తర్వాత 48 శాతం మందిలో గుండె పనితీరు మెరుగుపడటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆక్సిజన్ థెరపీతో మేలు జరుగుంది.