KA Paul (Image Credit To Original Source)
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్‌కు అమెరికాలోని కాన్సాస్‌లో అరుదైన గౌరవం దక్కింది. కాన్సాస్ రాష్ట్ర సెనేట్ సభ్యులను ఆశీర్వదించి ప్రసంగించారు కేఏ పాల్.
ప్రపంచంలో జరుగుతున్న 58 యుద్ధాలను ఆపాలంటూ అమెరికా నాయకులకు కేఏ పాల్ పిలుపునిచ్చారు. వెనెజువెలా, యుక్రెయిన్, గాజా, ఇజ్రాయెల్, ఇరాన్‌లో శాంతి కోసం ప్రార్థనలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: టోల్ ప్లాజాల వద్ద ఇప్పటికీ నగదు చెల్లిస్తున్నారా? మీకో షాకింగ్ న్యూస్
ప్రపంచంలో అత్యధిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దేశంగా అమెరికాను ప్రశంసించారు. చైనా, రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ ముప్పును ఎదుర్కొనేందుకు భారత్-అమెరికా కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.
అఫ్ఘానిస్థాన్, ఇరాన్ యుద్ధాలు అమెరికాకు నష్టం కలిగించాయని డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల నేతలు అంగీకరించారు. అంతకుముందు రిపబ్లికన్, డెమోక్రట్ నేతలు నిలబడి చప్పట్లతో కేఏ పాల్‌కు స్వాగతం పలికారు.