చైనాలో కార్లకు కడుపొచ్చింది..! సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్న ప్రజలు.. వీడియోలు వైరల్

చైనాలో కార్లకు కడుపొస్తుంది. ఈ వింతను చూసి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు.. కార్లు ఇలా ఉబ్బడానికి ప్రధాన కారణముంది..

pregnant cars

Pregnant cars in China : మహిళలకు కదా గర్భం వచ్చేంది.. కార్లకు గర్భం రావడం ఏమిటి అని ఆశ్చర్య పోతున్నారు. అవునండీ.. అక్కడ కార్లకు కూడా కడుపొస్తుంది. ఉన్నట్లుండి అవి ఉబ్బిపోతున్నాయి. ఈ విచిత్ర ఘటన ఎక్కడ జరిగిందో అనుకుంటున్నారా.. ఇంకెక్కడ.. అన్ని అనర్ధాలకు మూలమైన చైనా దేశంలో. కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన చైనాలో ఇలాంటి విచిత్రాలు జరగడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇంతకీ కార్లకు కడుపు రావటంకు కారణమేమిటి? అసలు అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాలను ఓ సారి తెలుసుకుందాం.

Also Read : ఎంత పని చేశావమ్మా..! ఐఏఎస్ అధికారి అత్యుత్సాహంతో చిక్కుల్లో రేవంత్ సర్కార్..! అసలేం జరిగిందంటే..

చైనాలో పలు కార్ల బ్యానెట్లు బానపొట్టలా ఉబ్బుతున్నాయి. చైనాలోని ప్రజలు వాటిని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. దీంతో చైనా కార్లకు కడుపొచ్చింది అనే ట్యాగ్ తో ఎక్స్ లో ఈ బానపొట్ట కార్ల ఫొటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇవేమీ కృత్రిమ మేధ మాయ కాదు.. తయారీలో లోపమూ కాదు. పర్యావరణ మార్పుల కారణంగా ఉబ్బిపోయాయట. ఇందులో ప్రముఖ కంపెనీల కార్లకూ ఇదే పరిస్థితి ఎదురవుతుందటం గమనార్హం. కార్లపై పెయింట్ దెబ్బతినకుండా ఉండటానికి సన్నని వినైల్ ఫిల్మ్ ను పైనుంచి అతికిస్తారు. తీవ్రమైన ఎండలో ఎక్కువసేపు ఉంటే వాటి వెనకాల అతికించిన రసాయనం వ్యాకోచం చెందిన కారణంగా కార్ల బ్యానెట్లు ఇలా ఉబ్బిపోయే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read : ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్ సిద్ధం.. ఏ నిమిషంలోనైనా యుద్ధం ప్రారంభం: అమెరికా

చైనాలోని కొన్నిప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఇలాంటి విపరిణామాలు సంభవిస్తున్నాయని అంటున్నారు. ఎండలో కార్లను ఎక్కువ సేపు ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చైనాలో కడుపొచ్చిన కార్లు అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు