భారీ దోపిడి.. మ్యూజియంలో రూ.7100 కోట్ల విలువైన వజ్రాభరణాలు మాయం

  • Publish Date - November 27, 2019 / 02:21 AM IST

డ్రెస్డన్ గ్రీన్ వాల్ట్ మ్యూజియంలోని సోమవారం (నవంబర్ 25, 2019) తెల్లవారుజామున భారీ చోరి జరిగింది. 18వ శతాబ్దానికి చెందిన అరుదైన ఆభరణాలను దొంగలించారు. ఈ ఘటన జర్మనీలోని డ్రెస్డెన్‌ నగరంలో చోటుచేసుకుంది. ఈ మ్యూజియం ప్రపంచంలోని పురాతన మ్యూజియంలలో ఒకటి. ఇక భవనానికున్న గ్రీన్ పెయింట్ వల్లనే ఈ మ్యూజియానికి గ్రీన్ వాల్ట్‌ అనే పేరొచ్చింది. 

 

ఇక ఈ చోరీకి గురైన ఆభరణాల విలువ రూ.7 వేల కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని జర్మన్ మీడియా చెబుతోంది. అంతేకాదు వాటిని వెలకట్టడం సాధ్యం కాదని డ్రెస్డెన్స్ స్టేట్ ఆర్ట్ కలెక్షన్స్ డైరెక్టర్ మారియన్ అక్రెమన్ తెలిపారు.  

భద్రతా సిబ్బంది నిమిషాల వ్యవధిలోనే సంఘటనా స్థలికి చేరుకున్నారు. వారు వచ్చేలోపే.. దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో దొంగల కోసం పోలీసులు నగరమంతా వెతుకుతున్నారు. చోరీకి పాల్పడిన వారు ఎక్కడికీ పారిపోకుండా వాహనాలను ఆపి తనిఖీలు చేపడుతున్నారు. దొంగతనానికి సంబంధించిన వీడియో అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది.