మాంసాహారుల్లో రకాలుంటారు బాస్. కానీ, ఇలాంటి వాళ్ల కథ వేరే ఉంటది. మనం చేపలు తిన్నంత ఈజీగా వాళ్లు పామును తినేస్తారు. కాబట్టే రెస్టారెంట్ మెనూల్లోకి కూడా ఎక్కేసింది పాము మాంసం. పైగా అది మామూలు జాతి పాము కాదు. కొండచిలువ మాంసం. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ మరికొద్ది రోజుల్లోనే రానుంది. బర్మీస్ కొండచిలువలు అతి త్వరలో మీ డైనింగ్ టేబుల్ మీదకు రానున్నాయంటూ రెస్టారెంట్లు ఊదరగొడుతున్నాయి.
ఫ్లోరిడా ఫిష్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కమిషన్ దీనిపై చర్చలు నిర్వహించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరీసృపాలలో అతి పెద్దవి కొండచిలువలు. దాదాపు 16 నుంచి 23అడుగుల పొడవుతో ఉంటాయి. ఒకవేళ వీటి మాంసం కూడా పనికి వస్తుందనుకుంటే మాంసాహారులకు పండుగే అంటున్నారు నిపుణులు. ఒకవేళ పాములో ఉండే మెర్క్యూరీ లెవల్స్ తక్కువ అనిపిస్తే మనుషులు తినడానికి ఇబ్బంది ఉండదని ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ చెప్తుంది.
ప్రాజెక్టులో భాగంగా.. చేస్తున్న పనులను కొవిడ్ కాస్త వెనకపడేలా చేసింది. కాంట్రాక్టర్ ప్రోగ్రాం కింద కొండచిలువల శాంపుల్స్ సేకరించడాన్ని పనిగా పెట్టుకున్నారు. దాదాపు ఎఫ్‌డబ్ల్యూసీ, సౌత్ ఫ్లోరిడా వాటర్ మేనేజ్మెంట్ డిస్ట్రిక్ట్ నిర్వహిస్తున్న ఫైతాన్ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో 6వేల కొండచిలువల వరకూ తొలగించేశారు.
‘ప్రకృతిలో ఉండే వాటిలో మెర్క్యూరీ ఒకటి. కొండచిలువల్లో అది ఎక్కువ మొత్తంలో నిక్షిప్తమై ఉంటుందనుకుంటున్నాం. వాతావరణంలో ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల పాములు ఫుడ్ చైన్ ద్వారానే మెర్క్యూరీని తీసేసుకుంటాయి. బహుశా వచ్చే ఫలితాలు పబ్లిక్ ను నిరాశపరచవచ్చు. కానీ, వారంతా ఏ ఇబ్బంది లేకుండా తినేందుకు అనుగుణమైన జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాం. అలా చేయడం వల్ల కొండచిలువల జనాభా తగ్గించగలుగుతామని అనుకుంటున్నాం’ అని ప్రోగ్రాం మేనేజర్ మైక్ కిర్క్‌ల్యాండ్ అంటున్నారు.
‘అది సరైన పద్ధతిలో వండితే చాలా బాగుంటుంది. పరిసరాల్లో ఉన్న కొండచిలువలు తొలగించే ప్రక్రియలో అందరూ భాగమైనట్లుగానూ ఉంటుంది. ప్రజలు వాటిని వేటాడి తినడం అనేది చాలా మంచి విషయం. దాని కంటే ముందు వాటిని తినడం సేఫ్ అనే విషయాన్ని కన్ఫామ్ చేయాలి’ అని ప్రోగ్రాం హంటర్స్ లో ఒకరైన డోన్నా కలీల్ అన్నారు.