Ram Mandir Defaced: రామమందిరంపై ఇండియాకు మోదీకి వ్యతిరేకంగా రాతలు

"ఈ సంభావ్య ద్వేషపూరిత నేరాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నాము. ఈ ఘటనపై 12 డివిజన్‌ విచారణ చేస్తుంది. తొందరలోనే నిందితులను కనుగొంటారు. కెనడాలో మత స్వేచ్ఛ అనేది ప్రధానమైన హక్కు. ప్రతి ఒక్కరూ వారి ప్రార్థనా స్థలంలో సురక్షితంగా ఉన్నారని మేము నిర్ధారించగలము. అలాంటి వాతావరణాన్ని ధ్వంసం చేసే వారిని వదిలిపెట్టము" అని ట్వీట్ చేశారు.

Ram Mandir Defaced: కొద్ది రోజుల క్రితం ఆస్ట్రేలియాలోని ఓ హిందూ దేవాలయం మీద ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు రాసిన ఘటన గుర్తుండే ఉంటుంది. అది గడిచి కొద్ది రోజులు కూడా కాకముందే కెనడాలో మరో ఘటన వెలుగు చూసింది. కెనడాలోని మిస్సిసౌగలో ఉన్న రామాలయం మీద దేశానికి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు రాశారు. ‘హిందుస్తాన్ ముర్దాబాద్’ అంటూ నినాదాలు చేశారు. ఇక ప్రధాని మోదీపై అయితే ఉగ్రవాది అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘మోదీని ఉగ్రవాదిగా ప్రకటించండి’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీబీసీ డాక్యూమెంటరీ అనంతరం ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంపై ఐటీ సోదాలు నిర్వహించిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నట్లుగా రామమందిరంపై ‘బీబీసీ’ అని బ్రాకెట్లో రాసుకొచ్చారు.

Godavari Express Derailed: ఘట్కేసర్ NFC దగ్గర పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‭ప్రెస్

మందిరంపై ఈ నినాదాలు చేసిన వారు ఖలిస్తానీ అనుకూలురనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆస్ట్రేలియాలో భారత్ వ్యతిరేక నినాదాలు చేసిన వారు కూడా ఖలిస్తానీ అనుకూలురే. ఇక కెనడాలో సిక్కుల జనాభా ఎక్కువగా ఉంటుంది. అందులో ఖలిస్తానీ అనుకూలురు కూడా ఉన్నట్లు విమర్శలు వస్తుంటాయి. కాగా, తాజా ఘటనపై కెనడాలోని భారత కాన్సూలేట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత వ్యతిరేక నినాదాలను ఖండించింది. ఇండియన్ కాన్సూలేట్ మంగళవారం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘మిస్సిసాగాలోని రామమందిరాన్ని భారత వ్యతిరేక నినాదాలతో దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ఘటనపై విచారణ జరిపి, నేరస్థులపై సత్వర చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను అభ్యర్థించాము’’ అని ట్వీట్ చేశారు.

Karnataka BJP chief: మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక బీజేపీ చీఫ్

బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ సైతం ఈ ఘటనపై స్పందించారు. ఇది ద్వేషపూరిత నేరమని, అధికారులు దీన్ని చాలా తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నారని ఆమె అన్నారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ “ఈ సంభావ్య ద్వేషపూరిత నేరాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నాము. ఈ ఘటనపై 12 డివిజన్‌ విచారణ చేస్తుంది. తొందరలోనే నిందితులను కనుగొంటారు. కెనడాలో మత స్వేచ్ఛ అనేది ప్రధానమైన హక్కు. ప్రతి ఒక్కరూ వారి ప్రార్థనా స్థలంలో సురక్షితంగా ఉన్నారని మేము నిర్ధారించగలము. అలాంటి వాతావరణాన్ని ధ్వంసం చేసే వారిని వదిలిపెట్టము” అని ట్వీట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు