Blue Moon
Blue Moon : పౌర్ణమి రోజు చంద్రుడు కనువిందు చేయనున్నాడు. ఆదివారం రాత్రి బ్లూమూన్ కనిపించనున్నట్లు అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ వెల్లడించింది. మేఘావృతం లేకుండా ఉంటే అందరు ఈ బ్లూమూన్ చూడొచ్చు. సాధారణంగా ఒక సీజన్‌లో మూడు పౌర్ణములు ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు నాలుగు పౌర్ణములు కూడా ఉంటాయి.. ఈ నాలుగు పౌర్ణములు ఉన్న సమయంలో వచ్చే మూడో పౌర్ణమిని బ్లూమూన్ అంటారు. నాసా ప్రకారం.. రెండు రకాల బ్లూమూన్స్ ఉంటాయి. ఒకటి నెలవారీగా, మరొకటి సీజనల్‌గా వచ్చే బ్లూమూన్.
ఒక నెలలో రెండు పౌర్ణములు వస్తే అందులో వచ్చే రెండో పౌర్ణమిని బ్లూమూన్ అంటారు. 1528లో తొలిసారి ఈ బ్లూమూన్ రికార్డయినట్లు నాసా తెలిపింది. అయితే చంద్రుడు నీలి రంగులో కనిపించడం మాత్రం అత్యంత అరుదుగా జరుగుతుంది. అగ్నిపర్వతాలు పేలినప్పుడు లేదా అడవుల్లో కార్చిచ్చు రగిలినప్పుడు భారీ ఎత్తున పొగ, దుమ్ముదూళి వాతావరణంలోకి వెళ్లినప్పుడు చంద్రుడు నీలి రంగులో కనిపిస్తాడు. భారత్ లో నిండు చంద్రుడిని అర్ధరాత్రి 12 గంటల సమయంలో చూడొచ్చు.