కరోనాకు హాట్ స్పాట్‌గా మారుతున్న ఆసుపత్రులు, కారణం ఇదే

  • Publish Date - June 11, 2020 / 12:35 PM IST

కరోనా వైరస్ కంటికి కన్పించదు.. అసలు మైక్రోస్కోప్‌లో అయినా కనీసం వందరెట్లు మాగ్నిఫై చేస్తే కానీ కన్పించదు. అయినా సరే అదెంత ప్రమాదకరమో తెలిస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఈ ప్రమాదం తెలీదు కాబట్టే.. చాలా చోట్ల హాస్పటల్సే వైరస్‌కి హాట్‌స్పాట్ సెంటర్లుగా మారిపోతున్నాయ్. అందులో ఒక్క చుక్క వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. కరోనా వైరస్ తుంపరలు మన కంటికి కన్పించవ్. .ఐతే అదెంత వేగంగా స్ప్రెడ్ అవుతుందన్నది తెలిస్తే మాత్రం బాడీ షేక్ అవడం ఖాయం. ఒక చిన్న చుక్క సైజులో ఉండే నావెల్ కరోనా వైరస్.. పది గంటల్లోనే సగం వార్డ్‌ని కమ్మేస్తుందట. జర్నల్ ఆఫ్ హాస్పిటల్ ఇన్ఫెక్షన్ వెల్లడించిన ఈ నిజం కరోనాతో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుపుతుంది. హాస్పటల్స్ కి వెళ్లినప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా…కరోనాని మోసుకొచ్చినట్లే అనుకోవాలి.

10 గంటల్లో ఐసోలేషన్ వార్డులోని సగం భాగం విస్తరించిన వైరస్:
యూకేలోని గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ హాస్పిటల్, యూనివర్సిటీ కాలేజ్ హాస్పటల్ రెండూ కలసి కరోనా ఆస్పత్రులలో వైరస్ వ్యాప్తి చెందే విధానంపై ఓ అధ్యయనం చేసింది. ఓ హాస్పిటల్ బెడ్‌పైన వైరస్ డీఎన్ఏ కనుక ఉండి ఉంటే.. అది పదే పది గంటల్లో ఐసోలేషన్ వార్డులోని సగం భాగం విస్తరించుకుంటూపోయిందని ఆ సర్వేలో తెలిపింది. ఐతే ఈ సర్వేలో నిజంగా సార్స్ కోవిడ్ 2 వైరస్ కాకుండా.. కృత్రిమంగా రెప్లికేట్ చేసిన డిఎన్ఏని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. మొక్కలకు మాత్రమే ఇన్ఫెక్ట్ అయ్యే వైరస్‌ను హాస్పటల్‌లో ప్రయోగించారు. ఈ వైరస్‌ని మిల్లీలీటర్ నీళ్లలో కరోనా వైరస్ కాపీలతో కలిపి ప్రయోగానికి సిద్ధం చేసారు. ఈ మిశ్రమాన్ని ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులోని ఓ బెడ్ హ్యాండిల్‌పై వేసారు. పది గంటల తర్వాత వైరస్ మెటీరియల్ 40శాతం హాస్పటల్ వార్డ్‌కి విస్తరించడం గమనించారు. హాస్పిటల్ మంచాల ఇనుప రెయిలింగ్స్, డోర్ హ్యాండిల్స్, వెయిటింగ్ రూమ్ హ్యాండిల్స్, చిన్నపిల్లల బొమ్మలకి పాకినట్లు సైంటిస్టులు గమనించారు. మూడు రోజుల్లోనే 59శాతానికి విస్తరించగా ఐదో రోజుకి మాత్రం 41శాతానికి వైరస్ స్ప్రెడ్ తగ్గిపోయిందని గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ హాస్పటల్ వర్గాలు గమనించాయ్.
 
హాస్పటల్స్ కి వెళ్తే.. వైరస్ కొనుక్కున్నట్లే:
దీంతో ఇప్పటిదాకా హాస్పటల్స్ కి వెళ్తే.. వైరస్ కొనుక్కున్నట్లే అనే ప్రచారంలో కాస్తైనా వాస్తవం ఉందనిపిస్తోంది. అందుకే యూనివర్సిటీ కాలేజ్ హాస్పిటల్ వర్గాలు కూడా ఇందులోని అసలు గుట్టుని విప్పి చెప్తున్నారు.. తాము వేసిన వైరస్ చుక్కలను హాస్పటల్ స్టాఫ్, పేషెంట్లు..వారిని చూడటానికి వచ్చినవారు తెలీకుండానే తాకడం దాని తర్వాత వారు వార్డ్‌లోని ఇతర ప్రదేశాలను తాకడం జరిగింది.. అలానే కరోనా వైరస్ కూడా ఉపరితలాలకు వ్యాపిస్తుందని తెలుస్తోంది.. ఈ అధ్యయనంతో అందరూ వ్యక్తిగత శుభ్రత, స్వీయ నియంత్రణ పాటించడం ఎంత ముఖ్యమో తెలుస్తోందని.. లీనా సిరిక్ అనే సైంటిస్ట్ చెప్తున్నారు.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతో పాటు..ఇతర ఉపరితలాలను టచ్ చేయకూడదని..లీనా సెరిక్ హెచ్చరిస్తున్నారు..

ఆస్పత్రులు కరోనాకి హాట్ స్పాట్స్ గా మారడానికి కారణమిదే:
మాయదారి రోగం అంతకంతకూ విస్తరిస్తున్న వేళ ఆసుపత్రులకు వెళ్లటం ఏ మాత్రం క్షేమకరం కాదనే వాదనని గ్రేట్ ఆర్మండ్ ఆస్పత్రి, యూనివర్సిటీ కాలేజ్ హాస్పిటల్ అధ్యయనం బలపరిచేదే. ఈ అధ్యయనం నేపథ్యంలో ఆసుపత్రుల్లోని వార్డుల్ని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ ఉండాలని చెబుతున్నారు. వైద్యులు..ఆరోగ్య సిబ్బంది అంతా పీపీఈ (వ్యక్తిగత రక్షణ పరికరాలు) కిట్లను తప్పనిసరిగా వాడాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది.. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్లే..  ఆస్పత్రులు చాలా చోట కరోనాకి హాట్ స్పాట్స్ గా మారుతున్నాయ్.  

బాత్ రూమ్ డోర్స్, హ్యాండ్ రెస్ట్, గోడలు, పెన్నులు, వాటర్ బాటిల్స్ ఏవి టచ్ చేసినా ప్రమాదమే:
ఈ అధ్యయనాన్నే ప్రస్తుత పరిస్ధితులకు అన్వయిస్తే.. కరోనా లక్షణాలతో టెస్టుల కోసం వెళ్లినవాళ్లు కూడా ఆల్రెడీ పాజిటివ్‌గా ఉన్న వ్యక్తులతోనే క్యూలైన్లలో నిలబడాల్సి వస్తుంది..లేదంటే ఐసోలేషన్ వార్డుల్లో వారితో కలిసి ఫలితాల కోసం ఎదురు చూడాల్సి రావచ్చు..అలాంటప్పుడు వారు తాకిన ఉపరితలాలు..బాత్ రూమ్ డోర్స్, హ్యాండ్ రెస్ట్, గోడలు..పెన్నులు..వాటర్ బాటిల్స్, వగైరా వగైరా ఏవి తాకినా ప్రమాదమే..ఎఁదుకంటే అంతకు ముందే వాటిపైన కనుక కరోనా సోకినవారు వదిలిన తుంపరులు పడి ఉంటే.. అలా అలా అందరికీ వ్యాపించవచ్చు..

ముఖంలోని కళ్లు ముక్కు నోరు టచ్ చేయకుండా ఉండటం మేలు:
ఐతే దీనికి నియంత్రణల్లా ఏది ముట్టుకున్నా..చేతులు పరిశుభ్రం చేసుకోవడం లేదంటే క్లీన్ చేసుకునే వరకూ ముఖంలోని కళ్లు ముక్కు నోరు టచ్ చేయకుండా ఉండటం.. ఇది ఒక్క పేషెంట్లు..ప్రజలకే కాదు..కరోనా వార్డుల్లో సేవలందించే నర్సులు వైద్యులు కూడా పాటించాలి..అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరమైతే తప్పించి ఆసుపత్రికి వెళ్లకూడదన్న మాటతో పాటు.. అవసరమై వెళ్లినా.. వెంట శానిటైజర్ ను ఉంచుకోవటం.. ముఖానికి మాస్కు పెట్టుకోవటం చాలా అవసరమన్నది మర్చిపోకూడదు. ఇది ఒక్క ఆస్పత్రులకే కాదు..ఏ ప్రదేశంలోనైనా వర్తిస్తుంది.