లక్ష్యానికి రెక్కలు : సౌదీ తొలి మహిళా రేసర్‌.. రీమా జుప్ఫాలీ

  • Publish Date - February 19, 2019 / 10:24 AM IST

మహిళలు ఆశలు..లక్ష్యాలు చేరుకోవాలంటే ఆయా దేశాల సంప్రదాయాలు..ఆంక్షలను దాటుకుని రావాలి. సౌదీలో మహిళలపై ఉండే ఆంక్షలు ఆమె లక్ష్యాన్ని కొంతకాలం ఆపగలిగాయి. మహిళలు డ్రైవింగ్ చేయకూడదనే ఆంక్షల వలయంలో చిక్కుకున్న ఆమె లక్ష్యం ఎట్టకేలకు నిషేధం ఎత్తివేతతలో నెరవేరింది. ఆమె సౌదీలో తొలి మహిళా కార్ రేసర్ రీమా ఆల్ జుప్ఫాలీ. 
 

కార్లంటే ఆమెకు పిచ్చి..రేసింగ్ అంటే ప్రాణం..ఆమె లక్ష్యం కూడా అదే. కార్ల రేసింగ్ లో పాల్గొనాలని ఆమె కల. ఆ కలను నెరవేర్చుకుంది రీమా. మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఆమె చేతులకు ఇంతకాలం  సంకెళ్లు వేశాయి. ఆ నిషేధాన్ని ఎత్తేస్తూ 2018 జూన్‌లో అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆమె లక్ష్యానికి రెక్కలొచ్చాయి. చేతిలోకి స్టీరింగ్‌ వచ్చింది. ఇంకేం.. సౌదీలో తొలి మహిళా కార్ రేసర్ గా రీమా ఆల్ జుఫ్ఫాలీ అనే 26 ఏళ్ల మహిళ చరిత్ర సృష్టించింది. 

విదేశాల్లో చదువుకొన్న రీమా..ఎఫ్‌1 కార్లంటే అమితంగా ఇష్టపడేది. తన స్వంత దేశానికి వెళ్లాక కార్లు నడపాలనీ..రేసింగ్‌ల్లో పాల్గొనాలని కలలు కన్నది. సౌదీ యువరాజు సంస్కరణల ఫలితంగా తన కలను సాకారం చేసుకుంది. కార్‌ రేసర్‌ లైసెన్సు పొందటమే కాక..పోటీలో కూడా పాల్గొంది. ఈ క్రమంలో  త్వరలో జరుగనున్న ఎమ్‌ఆర్‌ఎఫ్‌ చాలెంజ్‌ తుది రౌండ్‌లో పాల్గొని విజేతగా నిలవాలని ఆరాటపడుతోంది. మరి ఆల్ జుప్ఫాలీ కల నెరవేరాలని కోరుకుందాం..